వాట్సాప్ నుంచి మరొక సరికొత్త ఫీచర్.. ఏంటంటే..?!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వినియోగించే మేసెజింగ్ యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అని అనడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకర్షిస్తూ వస్తుంది.

ఇప్పటికే వాట్సాప్ వ్యూవన్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకునిరాగా వాటితో పాటు మల్టీ డివైజ్ సపోర్ట్, చాట్ ట్రాన్స్ఫర్, పేమెంట్స్, జాయినబుల్ కాల్స్, వాయిస్ మెసేజెస్ లాంటి సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.తాజాగా మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌ ను వాట్సాప్ మన ముందుకు తీసుకునిరానుంది.

ఈ ఫీచర్ త్వరలోనే అందరికి అందుబాటులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంతకీ ఆ సరికొత్త ఫీచర్ గురించి ఒకసారి తెలుసుకుందామా.

మనం వాట్సాప్ లోని చాట్ మొత్తాన్ని కాకుండా కొన్ని నిర్దిష్ట మెసేజ్‌ లను మాత్రమే రిపోర్ట్ చేసే ఫీచర్‌ ను డెవలప్ చేసే దిశగా వాట్సాప్ పరీక్షిస్తోంది.ప్రస్తుతానికి వాట్సాప్‌ లో పర్సనల్, బిజినెస్ చాట్స్‌ ను మాత్రమే రిపోర్ట్ చేసే అవకాశముంది.

Advertisement

ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ లలో టెస్టింగ్ చేస్తోన్న ఈ బీటా వెర్షన్ ఫీచర్ వలన దుర్వినియోగ స్పామ్ మెసేజ్‌ లను త్వరగ కనిపెట్టవచ్చని వాట్సాప్ భావిస్తోంది.అంటే యూజర్లు రిపోర్ట్ చేసిన మెసేజ్‌ లు మాత్రమే యాప్‌ కు ఫార్వర్డ్ అవుతాయన్నమాట.

అలాగే మెసేజ్ సెండర్‌ కు వీటి గురించిన వాట్సాప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

అలాగే బీటా వర్షన్‌ లో మెసెజ్‌ ను గట్టిగా హోల్డ్ చేసి నొక్కితే వినియోగదారులకు రిపోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ లో కూడా బీటా వెర్షన్ లో వ్యక్తిగత మెసేజ్ రిపోర్టును కూడా డబ్ల్యూఏబీటాఇన్ఫో పరిశీలించింది.వినియోగదారులు మెసేజ్ పై ఎక్కువ సేపు నొక్కి ఉంచితే రైట్ సైడ్ లో ఉన్నా మూడు చూక్కలు దగ్గర ఒక రిపోర్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది.

అప్పుడు ఆ అప్షన్ ఎంచుకోవడం వలన సింగిల్ మెసేజ్‌ను కూడా ఈజీగా రిపోర్ట్ చేయవచ్చున్నమాట.అయితే ప్రస్తుతం ఈ అప్షన్ అనేది అన్ని మొబైల్స్ లో అందుబాటులోకి రాలేదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఎప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో కూడా కంపెని క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వాడే యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు