టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య( Naga Chaitanya ) గురించి మనందరికీ తెలిసిందే.నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నప్పటికీ ఆ సినిమాలు ఏ ఒక్కటి కూడా సరైన విధంగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి.
వరుస ఫ్లాప్ లు నాగచైతన్య వెంటాడుతున్నాయి.ఒక నాగచైతన్య న మాత్రమే కాకుండా అక్కినేని హీరోలను ఫ్లాప్ లు వెంటాడుతూనే ఉన్నాయి.
గత ఏడాది విడుదల అయినా థాంక్యూ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక తాజాగా విడుదలైన కస్టడీ( Custody ) సినిమా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
![Telugu Dootha, Naga Chaitanya, Tollywood, Web-Movie Telugu Dootha, Naga Chaitanya, Tollywood, Web-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/05/web-series-naga-chaitanya-Custody-tollywood.jpg)
పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలలో ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ చైతన్యకు సరైన సక్సెస్ రావడం లేదు.ఇలా వరుసగా ఫ్లాప్ లు ఎదురవుతూ ఉండడంతో అటు నాగ చైతన్య ఇటు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పరిస్థితి కూడా ఇదే.దీంతో అక్కినేని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే నాగచైతన్య ఓటిటి డెబ్యూ దూత వెబ్ సిరీస్( Dootha Web Series ) ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.షూటింగ్ పూర్తిచేసుకుని చాలాకాలం అయ్యింది.
కొన్ని నెలల క్రితమే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేసి పాత్రలను పరిచయం చేశారు.అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించింది.
అయితే ఈ జాప్యం వెనుక కారణాలు వేరే ఉన్నాయని తెలిసింది.
![Telugu Dootha, Naga Chaitanya, Tollywood, Web-Movie Telugu Dootha, Naga Chaitanya, Tollywood, Web-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/05/dootha-web-series-naga-chaitanya-Custody-tollywood.jpg)
ప్రస్తుతం నాగ చైతన్య మార్కెట్ బాగా డల్ గా ఉంది.ఒకవేళ లాల్ సింగ్ చద్దా, థాంక్ యులో ఒకటి హిట్టయినా పరిస్థితి వేరుగా ఉండేది.కానీ జరగలేదు.
దీంతో ప్రైమే వాయిదా వేస్తూ పోతోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఈ వెబ్ సిరీస్ ని పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ప్రమోట్ చేయాలి కాబట్టి హీరో దర్శకుడి ఇమేజ్ చాలా కీలకమవుతాయి.
విక్రమ్ కుమార్ కు సైతం థాంక్యూ దెబ్బ బలంగా తగిలింది.అసలే దూత హారర్ జానర్.
వీటికి ఓటిటి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఉంటారు కానీ ఫైనల్ అవుట్ ఫుట్ పట్ల అమెజాన్ టీమ్ అంత సంతృప్తికరంగా లేకపోవడం వల్లే కొన్ని కీలక మార్పులకు రికమండ్ చేశారని వాటిని సరిచేసే పని ఆలస్యమవుతోందని మరో వెర్షన్ వినిపిస్తోంది.దీంతో దూత వెబ్ సిరీస్ ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదు.