బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kalvakuntla Kavitha ) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) లో ఈ రోజు కవిత ఈడి అధికారుల విచారణ కు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరైనా సరే మోదీని( PM Modi ) ప్రశ్నిస్తే ఇలాగే ఉంటుందంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను ఎన్నిసార్లు ఈడి విచారణకు పిలిచినా హాజరవుతానని, తాను ఎటువంటి తప్పు చేయలేదని కవిత అన్నారు.సిఆర్పి సి సెక్షన్ 160 ప్రకారం ఒక మహిళను విచారణ చేసేటప్పుడు ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాలని, కానీ ఈడి అధికారులు కార్యాలయానికి పిలుస్తున్నారంటూ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఈడి విచారణపై మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడం పై కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించడం కుదరదని , కవిత వేసిన ఎమర్జెన్సీ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.ఈ నెల 24వ తేదీన విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, నేడు ఈడి విచారణకు కవిత హాజరవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ నెల 11వ తేదీన కవిత ఈడి విచారణకు హాజరయ్యారు.
దాదాపు 9 గంటల పాటు ఈడి అధికారులు విచారించారు.ఈరోజు మరోసారి హాజరవుతున్నారు.

దీంతో బీ ఆర్ ఎస్ కీలక నేతలంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.ఈ రోజు జరగబోయే ఈడీ విచారణ పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది .ఇది ఇలా ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కవిత తీవ్రంగానే స్పందిస్తున్నారు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేవరకు ఇదేవిధంగా ఒత్తిడి తీసుకొస్తామని, బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటాన్ని ఆపేదే లేదని కవిత చెబుతున్నారు.ఇక ఈ పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించామని, కానీ కాంగ్రెస్ నుంచి స్పందనలేదని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలను కూడా త్వరలోనే తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తామని చెబుతున్నారు.
రైతు ఉద్యమం తరహాలోనే మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాము అంటూ కవిత చెప్పుకొచ్చారు.