రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే ఉదయం తీసుకునే ఫుడ్ పై ప్రత్యేక శ్రద్ధ కచ్చితంగా వహించాలి.ఎందుకంటే మన డే లో ఇది ఫస్ట్ మీల్.
ఉదయం పూట ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.ఉదయం చాలా మంది ఏది పడితే అది తినేస్తుంటారు.
దీంతో ఆరోగ్యం ( Health ) దెబ్బతింటుంది.కానీ ఇకపై ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజు ఉదయాన్నే తీసుకుంటే ఇక మీ ఆరోగ్యానికి తిరుగు ఉండదు.
ఎన్నో అమోఘమైన ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.మరి ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax Seeds ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఒక క్యారెట్ ను( Carrot ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు ఉసిరికాయలు తీసుకుని వాటర్ లో కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న అవిసె గింజలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ క్యారెట్ ఆమ్లా ఫ్లాక్స్ సీడ్స్ జ్యూస్( Carrot amla flax seeds juice ) రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు చొప్పున ఈ జ్యూస్ ను తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.
గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తహీనత ఉంటే పరార్ అవుతుంది.
కంటి చూపు రెట్టింపు అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
బెల్లీ ఫ్యాట్ మాయం అవుతుంది.డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.
మరియు జుట్టు రాలడం తగ్గుతుంది.చర్మం యవ్వనంగా సైతం మెరుస్తుంది.