Car Brake Fail: సడన్‌గా కారు బ్రేక్ ఫెయిల్ అవుతే ఏం చేయాలి..?

సాధారణంగా ప్రజలు కారులో వెళ్తున్నప్పుడు 70-90 మెయింటైన్ చేస్తుంటారు.ఇలాంటి సమయంలో ఒకేసారి బ్రేక్స్ ఫెయిల్ అవుతే చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతారు.

 What To Do If Car Brake Suddenly Fails Details, Car, Car Brake Failures, Brake F-TeluguStop.com

ఏం చేయాలో తెలియక అదే వేగంతో ఏదో ఒక వాహనానికి లేదా చెట్టుకు గుద్దేస్తారు.కాగా నిపుణుల ప్రకారం, బ్రేక్స్ ఫెయిల్ అవుతే కంగారు పడకుండా కొన్ని పనులు వెంటనే చేయాలి.

తద్వారా ఎలాంటి గాయాల పాలు కాకుండా, కారుకు ఎలాంటి డామేజ్ కాకుండా జాగ్రత్త పడొచ్చు.మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బ్రేక్స్ పడనప్పుడు వెంటనే డ్రైవర్ బ్రేక్ పెడల్‌ను స్పీడ్ నొక్కాలి.ఆపై కాలును బ్రేక్ పైనుంచి తీసేయాలి.ఇలా చేస్తుంటే బ్రేక్స్ మళ్లీ పని చేసే అవకాశం ఉంటుంది.ఇక కారు వేగాన్ని తగ్గించడానికి, వెంటనే మొదటి గేర్‌కి డౌన్‌షిఫ్ట్ చేయాలి.

యాక్సిలరేటర్ పెడల్‌ని నొక్కి, క్లచ్‌ని విడుదల చేయకూడదు.కారును ఆపడానికి హ్యాండ్‌బ్రేక్‌ను జాగ్రత్తగా పైకి లాగాలి.

హ్యాండ్‌బ్రేక్ హైడ్రాలిక్ కాకుండా మెకానికల్‌గా ఉంటుంది.దీనివల్ల వెనుక వైపు టైర్లు స్లో అవుతాయి.

కారు మొదటి గేర్‌లో ఉన్నప్పుడు, ఇగ్నిషన్ ఆఫ్ చేయాలి.

Telugu Brake Tips, Brake Failure, Car Brake, Carbrake, Car Safety Tips, Tips-Gen

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా బ్రేక్స్ ఫెయిల్ అయిన వెంటనే లెఫ్ట్ వైపుకు వచ్చేయాలి.అలానే హజార్డ్ లైట్లు, హెడ్‌లైట్లు, హారన్‌లతో ఇతర డ్రైవర్లను అప్రమత్తం చేయాలి.కారు వెంటనే స్లో అవ్వడానికి రోడ్డు పక్కన ఉన్న ఏదైనా ఇసుక లేదా బురదలోకి వెళ్ళాలి.

దీని వల్ల వాహనం స్లో అయి చివరకు ఆగిపోతుంది.ఇక డ్రైవ్ కోసం కారును బయటకు తీసుకెళ్లే ముందు, ఎల్లప్పుడూ బ్రేక్‌లను చెక్ చేసుకోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube