ట్యాటూ వేయించుకున్నారా? మ‌రి మీకు ఈ విష‌యాలు తెలుసా?

ట్యాటూ(ప‌చ్చ‌బొట్టు). దీని గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.ఒక‌ప్పుడు త‌మ ప్రేమను వ్య‌క్తం చేసేందుకు ట్యాటూలు వేయించుకుంటే.

ఇప్పుడు ఫ్యాష‌న్ పేరుతో వాటి వెన‌క ప‌రుగులు పెడుతున్నారు.చేతులు, కాళ్లు, మెడ‌, న‌డుము ఇలా ఎక్కడ ప‌డితే అక్క‌డ రంగురంగుల ట్యాటూలు వేయించుకుంటున్నారు.

స‌రే ఎవ‌రి ఇష్టం వారిది అనుకోండి.కానీ, ట్యాటూలు వేయించుకునేవారు చ‌ర్మ సంర‌క్ష‌ణ విష‌యంలో కొన్ని విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.

మ‌రి ఆ విష‌యాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా ట్యాటూలు వేయించుకున్న‌ప్పుడు అక్క‌డి చ‌ర్మ క‌ణాలు దెబ్బ తింటాయి.

Advertisement

దాంతో చ‌ర్మం డ్రైగా మారిపోతుంది.దీనిని అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

పొడి బారిన చ‌ర్మాన్ని తేమ‌గా మార్చుకునేందుకు మాయిశ్చరైజ్ చేసుకోవాలి.రోజుకు క‌నీసం రెండు సార్లు అయినా ట్యాటూ వేయించుకున్న చోట‌ చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.

త‌ద్వారా దెబ్బ తిన్న క‌ణాలు రిపేర్ అవ్వ‌డ‌మే కాదు కొత్త క‌ణాలు సైతం ఉత్ప‌త్తి అవుతాయి.ఫ‌లితంగా అక్క‌డ చ‌ర్మం కోమ‌లంగా మారుతుంది.

ట్యాటూ వేయించుకున్న వారు త‌ప్ప‌కుండా స‌న్‌స్క్రీన్ ను కూడా యూస్ చేయాలి.అలాగే ట్యాటూ వేయించుకున్న చోట రెండు, మూడు వారాల పాటు ఎలాంటి స్క్ర‌బ్‌లు, ప్యాకులు, మాస్క్‌లు, వ్యాక్స్‌లు వంటివి యూస్ చేయ‌రాదు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఎందుకంటే, వాటి వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్, తీవ్ర‌మైన దుర‌ద‌ లేదా ఇత‌రిత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ ఉంటుంది.కొంద‌రికి రెగ్యుల‌ర్‌గా స్విమ్మింగ్ చేసే అల‌వాటు ఉంటుంది.కానీ, ట్యాటూ వేయించుకున్న‌వారు ఓ ప‌దిహేను రోజుల పాటు స్విమ్మింగ్ కు దూరంగా ఉండ‌ట‌మే మంచిది.

Advertisement

స్విమ్మింగ్ పూల్స్‌లోని నీటిలో క్లోరిన్‌ ఎక్కువగా ఉంటుంది.ఇది ట్యాటూ వేయించుకున్న చర్మాన్ని మ‌రింత పొడిగా, నిర్జీవంగా మార్చేస్తుంది.

అందుకే స్విమ్మింగ్‌ను కొద్ది రోజులు ఎవైడ్ చేయాలి.ఇక ట్యాటూ గాయం రెండు, మూడు వారాల్లో త‌గ్గ‌కుంటే ఖ‌చ్చితంగా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

లేట్ చేసే కొద్ది అలర్జీ, ఇన్ఫెక్ష‌న్‌, ర్యాషెస్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది.

తాజా వార్తలు