బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈటీవీలో మల్లెమాలవారు కేవలం కామెడీ షోలు మాత్రమే కాకుండా డాన్స్ షోలు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
గత కొన్ని సంవత్సరాల నుంచి ఢీ డాన్స్ షో ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఎంతో మంది టాలెంట్ కలిగిన కొరియోగ్రాఫర్లకు ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తుంది.ఇకపోతే ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఢీ 14 ఫైనల్స్ కు చేరుకుంది.
ఈ ఫైనల్స్ ఆదివారం ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.
ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు హీరో మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.ఈ ప్రోమోలో భాగంగా రవితేజ ఎప్పటిలాగే తన మార్క్ కామెడీ, బాడీ లాంగ్వేజ్‌తో ఫుల్ జోష్ నింపేశారు.
అందర్నీ తన కామెడీతో పెద్ద ఎత్తున నవ్వించారు.ఇకపోతే రవితేజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హైపర్ ఆది పై సెటైర్లు వేస్తూ ఓ రేంజ్ లో ఆదిని ఆడుకున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మెంటర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో కమెడియన్ గా నటిస్తున్నారు.ఈ క్రమంలోనే కమెడియన్ గా పేరు సంపాదించుకున్నటువంటి హైపర్ ఆది ఈ డాన్స్ షోలో కనిపించడంతో రవితేజ హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ అయినా నీకు ఈ డాన్స్ షో తో సంబంధం ఏంటి అంటూ ప్రశ్నిస్తూ.తనను ఆట పట్టించారు.
ఇక తన కామెడీతో మాత్రమే కాకుండా డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా కూడా రవితేజ సందడి చేసిన్నట్లు తెలుస్తోంది.







