సాయి దరమ్ తేజ్ చేస్తున్న గాంజా శంకర్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.అయినప్పటికీ వాళ్లు సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లిన వారు మాత్రమే ఇక్కడ చాలా సంవత్సరాల పాటు కొనసాగుతారు.

 What Is The Reason Why Ganja Shankar Stopped Performing Sai Daram Tej , Ganja Sh-TeluguStop.com

అలా కాకుండా వరుస ఫెయిల్యూర్స్ తో ముందుకు సాగాలి అనుకోవడం మాత్రం ఇక్కడ చాలా కష్టమైన పని అందుకే ఫెయిల్యూర్స్ వచ్చిన చాలామంది హీరోలు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతూ ఉంటారు.

ఇక ఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి మెగా అల్లుడుగా ఎంట్రీ ఇచ్చిన సాయి దరమ్ తేజ్( Sai Daram Tej ) ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈయన సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ ( Ganja Shankar )అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇక అందులో భాగంగానే దనికిబ్సంబంధించి 20% వరకు షూటింగ్ కూడా పూర్తయింది.

ఇక సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్( Sitara Entertainments ) వారు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారనే విషయం కూడా మనకు తెలిసిందే.

అయినప్పటికీ ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని మేకర్స్ ఆపివేసినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో సాయి దరమ్ తేజ్నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఈ సినిమా కనక షూటింగ్ జరిగి రిలీజ్ అయితే సాయి దరమ్ తేజ్ కి మంచి విజయం దక్కుతుంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకి వెళుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయకు తప్పదు…ఇక ఇప్పుడు సంపత్ నంది ఓదెల రైల్వే స్టేషన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube