సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ తనదైన రీతిలో సక్సెస్ లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులు ఆదరణ పొందుతూ ఉంటాయి.
ఇక ఇలాంటి ప్రాసెస్ లో ఒక హీరో తన కెరియర్ హీరోగా పీక్స్ టైంలో ఉన్నప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు గాని, సెకండ్ హీరో పాత్రలు గాని చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు.కానీ యంగ్ హీరో అయిన నవదీప్( Navdeep ) మాత్రం చందమామ లాంటి ఒక సూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ తో( Allu Arjun ) కలిసి ఆర్య 2( Arya 2 ) సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అనేది ఆయన కెరియర్ కి బాగా మైనస్ అయిందనే చెప్పాలి.
ఇక అప్పటినుంచి హీరోగా ఆయనకు అవకాశాలు అనేవి తగ్గుముఖం పట్టాయి.హీరోగా తనకి చెప్పుకోదగ్గ అవకాశం ఒకటి కూడా రాలేదు.ఒకవేళ ఆయనకి హీరోగా చేసే అవకాశం వచ్చిన అవి పెద్దగా సక్సెస్ ని సాధించే సినిమాలు అయితే కాదు.ఇక ఇండస్ట్రీ లో గుర్తింపు ఉన్న డైరెక్టర్ నుంచి ఆయనకు ఒక్క అవకాశం కూడా రాకపోవడం విశేషం… ఇక ఆ తర్వాత ఆయన రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధృవ సినిమాలో( Dhruva Movie ) రామ్ చరణ్ ఫ్రెండ్ గా నటించాడు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆయనకి హీరోగా అయితే అవకాశాలు రావడం లేదు.ఫ్రెండ్ క్యారెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే నటిస్తున్నాడు.అందువల్లే ఆయన కెరియర్ అనేది అంత సాఫీగా సాగడం లేదు.ఇక మొత్తానికైతే నవదీప్ ఒక టాలెంటెడ్ హీరో అయినప్పటికీ, ఆయన సినిమాల ఎంపిక లో చేసిన ఈ తప్పుల వల్లే ఆయనకి హీరోగా కెరియర్ లేకుండా పోయింది…
.