భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ పార్టీ ( Congress party )నిర్వహించిన ఎన్నికల సమావేశానికి భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాజరయ్యారని తెలుస్తోంది.
ఇల్లందులో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమావేశం జరిగింది.కాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tummala Nageswara Rao )ఆధ్వర్యంలో జరుగుతున్న కాంగ్రెస్ సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు( MLA Tellam Venkatarao ) హాజరయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ గూటికి చేరతారంటూ ప్రచారం జోరుగా సాగినప్పటికీ ఆయన ఆ వార్తలను కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా కాంగ్రెస్ ఎన్నికల సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం హాజరుకావడంతో మరోసారి ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది.