దేవాదాయ శాఖలో అవినీతిపై త్వరలో ఎంక్వయిరీ.రాజన్న దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ.
రాజన్న ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం.రాజన్న సిరిసిల్ల జిల్లా :దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సోమవారం దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు రాజన్న కి ఇష్టమైన కోడి మొక్కుని చెల్లించుకున్నారు .ఈ సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రసిద్ధి గల దేవాలయం శ్రీ వేములవాడ రాజేశ్వర స్వామి అలయం అని, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం రాజన్న అని అన్నారు.రాజన్న ఆలయాన్ని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ తో కలిసి అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో జరిగిన విధంగానే దేవాదాయ శాఖలో మీతిమీరి నా అవినీతి, అక్రమాలు జరిగినాయని, దేవుని మాన్యాలను కబ్జాలు చేశారని, త్వరలోనే ఎంక్వయిరీ కమిషన్ కి ఆదేశిస్తామని అన్నారు.
దేవాదాయ భూముల సర్వే చేపించి, హద్దులు ఏర్పాటు చేసి, దేవుని పేర్లపై పాసుబుక్కులు ఇస్తామని అన్నారు.దేశ విదేశాల నుండి ఎవరైనా భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇవ్వాలనుకుంటే ప్రత్యేక వెబ్సైట్ను రూపొందిస్తున్నామని, ఆ వెబ్సైట్ ద్వారా ఏగుడికి విరాళం ఇవ్వాలనుకుంటున్నారో, ఆ గుడికి విరాళం వెళుతుందని అన్నారు.
ప్రభుత్వం, టీటీడీ, ఈ భక్తుల సహాయంతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని, త్వరలోనే అలయలకి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో దేవుళ్లను దర్శనం చేసుకోవచ్చని అన్నారు.ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమురయ్య కనికరపు రాకేష్, చిలుక రమేష్, ఇప్పపుల అజయ్, అన్నారం శ్రీనివాస్, పాత సత్యలక్ష్మి, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, ముప్పిడి శ్రీధర్, ముంజ ఉమెందర్, నాగుల రాము.
తదితరులు ఉన్నారు








