బీజేపీ వైఖరిపై కేసీఆర్ మౌనం వెనుక అసలు కారణమిదే?

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలతో హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా బీజేపీ కార్యాచరణను రూపుదిద్దుకోవడంతో పాటు తాజాగా అమిత్ షా తో సమావేశం తరువాత బీజేపీ మరింతగా దూకుడు పెంచిన విషయం తెలిసిందే.

అయితే బీజేపీ ఇంతలా రాజకీయ విమర్శలు, దీక్షలు చేస్తున్నా కేసీఆర్ మాత్రం అస్సలు స్పందించడం లేదు.ఇప్పుడు ఈ విషయమే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన పరిస్థితుల్లో ఆంక్షలను ఎవరు అతిక్రమించినా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.అందులో భాగంగానే బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేయడం, జెపీ నడ్డా ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం లాంటి చర్యలు తీసుకోవడం జరిగింది.

ఆయితే ప్రస్తుతం ప్రజలందరి దృష్టి అంతా కరోనా కేసులు పెరుగుతున్నాయనే విషయంపై ఉండటంతో బీజేపీ పార్టీ ఆందోళన కూడా ప్రజలు అంతగా పట్టించుకునే పరిస్థితి ఉండదనే నమ్మకంతో కెసీఆర్ ఉన్నట్టు సమాచారం.అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం రకరకాల విభాగాల్లో ప్రధమ స్థానంలో నిలుస్తూ ఉండటంతో తెలంగాణలో అభివృద్ధిపై బీజేపీ నేతలు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఉంది.

Advertisement

అందుకే ఈ తరహా భయాందోళన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా జెపీ నడ్డా విమర్శించినా, బండి సంజయ్ అరెస్ట్ స్పందించలేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యవహరించిన తీరుపై అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదని, అంతేకాక బీజేపీ పార్టీ దీక్షకు ఉపాధ్యాయులే అంతగా మద్దతు ఇవ్వకపోవడంతో మరికొన్ని రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు