తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రత్యేక స్థానముంది.తమదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ రాజకీయాల్లో కొనసాగుతున్న కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
జిల్లా నుంచి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారు తమ పట్టు నిలుపుకుంటున్నారు.ఇకపోతే ఇటీవల కాలంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఆ తర్వాత సద్దుమణిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.అన్న వెంకట్‌రెడ్డి అధిష్టానం పట్ల సీరియస్‌నెస్ కొంత తగ్గించారు.
కానీ, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఇంకా ఫైర్ అవుతున్నట్లు ఆయన చర్యలను బట్టి తెలుసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

టీపీసీసీ చీఫ్ పదవి అంగట్లో అమ్మాకానికి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేసినా తర్వాత ఆ విషయమై ప్రస్తావించడం లేదు.తన భువనగిరి నియోజకవర్గంలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చేస్తున్నారు.అయితే, రాజగోపాల్‌రెడ్డి మాత్రం అలా కాదు.
ఇప్పటికే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నరాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీపైనే, ఆపోజిట్ పార్టీపైన కత్తులు దూస్తున్నారు.మంత్రి జగదీశ్‌రెడ్డి మైక్ లాక్కుని బహిరంగంగానే గొడవ పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పార్టీకి తన సపోర్ట్ ఉంటుందని పేర్కొనడం గమనార్హం.
షర్మిల నిరుద్యోగలు దీక్షకు తన మద్దతు ఉంటుందని, తన మునుగోడు నియోజకవర్గంలోనే దీక్ష చేపట్టడం సంతోషకరమని చెప్పడం ఆసక్తికరం.ఇలాంటి తాజా పరిణామాల నేపథ్యంలో అన్నదమ్ములు తలోదారిలో వెళ్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది.తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయనకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటికే తన సర్వేలో ఈటల నెగ్గుతున్నట్లు తేలుతున్నదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొనగా, ఈటలకు తన మద్దతు ఉంటుందని, ఈటల నిజాయితీపరడని రాజగోపాల్‌రెడ్డి చెప్పడం ఆసక్తికరకం.ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు హుజురాబాద్‌లో ఎలా ఉండబోతుందనేది అనేది చర్చనీయాంశమే.