చంటబ్బాయి సినిమాలో క్లైమాక్స్ మార్చిన జంధ్యాల అసలు క్లైమాక్స్ ఏంటంటే..?

చిరంజీవి( Chiranjeevi ) హీరోగా జంధ్యాల( Jandhyala ) డైరెక్షన్ లో వచ్చిన చంటబ్బాయి సినిమా( Chantabbai movie ) చాలా మంచి సినిమా అనే చెప్పాలి.

ఈ సినిమా అప్పుడు అంత పెద్దగా ఆడలేకపోయినప్పటికీ కూడా ఇప్పటికి ఈ సినిమాని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.

అయితే ఈ సినిమా చాలా కామెడీ గా ఉంటుంది.అయినప్పటికీ అక్కడక్కడ చిన్నయాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి అయితే కంప్లిట్ చిరంజీవి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాక కామెడీ చేసిన సినిమా ఇది.అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ సూపర్ హిట్ అవ్వాల్సింది కానీ మిస్ అయింది చిరంజీవి సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ సినిమా.

What Is The Original Climax Of Jandhyala Changed The Climax In The Movie Chanta

అయితే జంధ్యాల ఈ సినిమాలో మొదట ఒక పెద్ద యాక్షన్ సీన్ తో క్లైమాక్స్ ప్లాన్ చేశారట, కానీ చివరికి అది కామెడీ ఫైట్ తో, చంటబ్బాయి ఎవరు అనే ఒక సస్పెన్సు ని బ్రేక్ చేస్తూ ఉన్నది మాత్రమే చివరికి సినిమా లో ఉంచారు.ఆయన ఇలా ఎందుకు చేసారు అంటే సినిమా మొత్తం కామెడీగా ఉండి చివర్లో ఆలా సీరియస్ యాక్షన్ ఎపిసోడ్ పెడితే అంత బాగుండదు అని ఆలా చేసినట్టుగా ఆయన కొన్ని సందర్భాల్లో తెలియజేసారు.ఏది ఏమైనప్పటికీ ఆ సినిమా ఒక క్లాసిక్ అనే చెప్పాలి.

What Is The Original Climax Of Jandhyala Changed The Climax In The Movie Chanta

ఇక ప్రస్తుతం చిరంజీవి ఫాన్స్ చాలా మంది అలాంటి సినిమా ఒకటి తీస్తే చూడాలని అనుకుంటున్నట్టుగా అప్పట్లో కొన్ని న్యూస్ లు కూడా వచ్చాయి.చంటాబ్బాయి సినిమా తర్వాత చిరంజీవి అలాంటి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా ఇప్పటి వరకు చేయలేదు.అందుకే మరోసారి అలాంటి సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు చిరంజీవి కూడా అప్పట్లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ అలాంటి సినిమా చేయాలనీ ఉంది అని చెప్పారు.

Advertisement
What Is The Original Climax Of Jandhyala Changed The Climax In The Movie Chanta

కానీ ఎప్పుడు చేస్తారు అనేది క్లారిటీ గా చెప్పలేదు.ఇక ఈ సంవత్సరం ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ కొట్టారు, ఇక భోళా శంకర్ సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు