AP BJP : ఏపీ బీజేపీలో ఏంటీ కన్ఫ్యూజన్ ? అభ్యర్థులే దొరకడం లేదా ?

ఇప్పటికే టిడిపి, జనసేన, వైసీపీలు తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను దాదాపుగా ప్రకటించేశాయి.

కానీ టిడిపి, జనసేనతో( TDP, Jana Sena ) పొత్తు పెట్టుకుని పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలను తీసుకున్న బిజెపి మాత్రం ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించే విషయంలో నాన్చివేత ధోరణిని అవలంబిస్తోంది.

అభ్యర్థుల ప్రకటన పూర్తయితే, వారు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.కానీ బిజెపి అగ్ర నేతలు మాత్రం అభ్యర్థులను ఫైనల్ చేసే విషయంలో పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

పొత్తులో భాగంగా బిజెపి తీసుకున్న సీట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చినా, ఏ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనే విషయంలో సరైన క్లారిటీ ఆ పార్టీ నేతలకు రావడం లేదు.పొత్తులో భాగంగా టిడిపి, జనసేన కేటాయించిన సీట్లలో బిజెపి బాగా బలహీనంగా ఉందని, గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే కలుగుతున్నాయి.

బిజెపి మొదటి నుంచీ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న చాలా నియోజకవర్గాల్లో టిడిపి తమ అభ్యర్థులను ప్రకటించింది.

Advertisement

ముఖ్యంగా విశాఖ నుంచి పోటీ చేయాలని బిజెపి కీలక నేతలు చాలామంది ఆశలు పెట్టుకున్నారు.అయితే అక్కడ టిడిపి తమ పార్టీ అభ్యర్థిగా భరత్ ను ప్రకటించింది.దీంతో విజయనగరం లోక్ సభ స్థానాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అక్కడ నుంచి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బిజెపి( P V N Madhav ) తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, నరసాపురం, కడప నుంచి పోటీ చేయాలని బిజెపి భావిస్తోంది.

హిందూపురం నుంచి పోటీ చేయాలని ముందుగా భావించినా అక్కడ టిడిపి తన అభ్యర్థిగా బికే పార్థసారధిని ఎంపిక చేసింది.దీంతో కడప లోక్ సభ స్థానం నుంచి ఆదినారాయణ ను పోటీకి దించాలని బిజెపి భావిస్తోంది.

శాసనసభ స్థానాల విషయానికొస్తే ఇక్కడా క్లారిటీ లేదు.సీనియర్లు మాత్రం తాము పోటీ చేద్దామనుకున్నా, ఓడిపోయే స్థానాలను పొత్తులో భాగంగా కేటాయించారని బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం కలకాలమే రేపింది.దీంతో బిజెపి కి కేటాయించిన సీట్లలో ఆ పార్టీ అగ్ర నేతలు మరోసారి పునరాలోచన చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిఫైనా ఇంకా క్లారిటీ రాలేదు.అలాగే అనంతపురం టౌన్ తో పాటు, ధర్మారం స్థానాల్లోనూ పోటీ చేయాలని బిజెపి భావిస్తున్నా, అక్కడ అభ్యర్థులు కొరత లేకపోయినా, ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఏ క్లారిటీ ఇవ్వడం ఇవ్వడం లేదు.

Advertisement

ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari) ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలతో చర్చించారు.కానీ వారెవరు సరైన క్లారిటీ ఇవ్వలేదు.దీంతో ఏపీలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

తాజా వార్తలు