కార్తిక పూర్ణిమకు గల విశిష్టత ఏమిటి.. ఆ రోజున దంపతులు సరిగంగా స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే హరిహరాదుల మాసం కార్తీక మాసం( Karthika Masam ) అని పండితులు చెబుతున్నారు.

ఈ మాసమంతా పూజలు, ఉపవాసాలతో ఇల్లు, దేవాలయాలు ఎంతో సందడిగా ఉంటాయి.

శివ కేశవులకు భేదం లేదని చెప్పడమే ఈ మాసం ప్రాముఖ్యత అని పండితులు చెబుతున్నారు.అందుకే ఈ మాసంలో శివుడిని( Lord Shiva ), శ్రీమహావిష్ణువుని సమానంగా ఆరాధిస్తారు.

చంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది అని దాదాపు చాలామందికి తెలుసు.శరదృతువులో రెండో నెల.ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రం దగ్గర సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తిక మాసం అని పిలుస్తారు.కార్తిక మాసానికి సమానమైన మాసము లేదు.

శ్రీమహావిష్ణువు సమానమైన భగవంతుడు లేడు.వేదముతో సమానమైన శాస్త్రం లేదు.గంగతో సమానమైన తీర్థము లేదు అని పండితులు చెబుతున్నారు.

Advertisement

దీపావళి నుంచి నెల రోజుల పాటు నియమనిష్టలతో కార్తిక వ్రతాన్ని( Karthika vrata ) నిర్వహిస్తారు.ఇక ఈ కార్తిక మాసం మొత్తంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవే అని పండితులు చెబుతున్నారు.ఇందులో కూడా కార్తీక పూర్ణిమ అంటే ఎంతో ప్రత్యేకమైనదని కూడా చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే పూర్వం వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు మత్స్యావతారం( Vishnu Matsya Avatara ) ధరించినది కార్తీక పౌర్ణమి రోజే అని పండితులు( Scholars ) చెబుతున్నారు.పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించింది కూడా పౌర్ణమి రోజునే కావడంతో దీనికి త్రిపుర పౌర్ణమి అని కూడా పేరు వచ్చింది.

దేవ దీపావళి, కైశిక పౌర్ణమి, జీటి కంటి పున్నమి కుమార దర్శనం అనే పేర్లతో కూడా పిలుస్తారు.

కార్తీక పౌర్ణమి రోజు వెన్నెలలో పాలు కాస్తే ఆ పాలు అమృత అవుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.అందుకే పూర్వకాలంలో కార్తీక పౌర్ణమి ( Karthika Pournami )వెలుగులో పోయి వెలిగించి పాలను మిర్యాలతో పాటు కాచి తాగేవారు.కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతో పాటు దానికి అతిచేరువలోనే దేవతల గురువైన బృహస్పతి కూడా కనిపిస్తాడని పండితులు చెబుతున్నారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024

ఆ గురు శిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలలో ఉంది.ఇంకా చెప్పాలంటే తులా సంక్రమణం జరుగుతున్న కార్తీకమాస సమయంలో శ్రీమహావిష్ణువు ప్రతి నీటి బొట్టులో వ్యాప్తి చెంది ఉంటాడని పండితులు చెబుతున్నారు.

Advertisement

అందుకే ఈ నెలలో ఒకసారి అయినా నది స్నానం ఆచరిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని కూడా చెబుతున్నారు.ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ప్రాతఃకాలంలో దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే ఆ దంపతులు శివకేశవుల అనుగ్రహాన్ని పొందుతారని కూడా చెబుతున్నారు.

తాజా వార్తలు