విజయవాడ టిడిపి( Vijayawada TDP ) లో ఏదో ఒక వార్ నిత్యం నడుస్తూనే ఉంటోంది .మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) , కేశినేని చిన్నిల( Keshineni Chinni ) వ్యవహారం తలనొప్పిగా మారింది.
నాని వైసీపీలో చేరడంతో అక్కడితో ఆ రచ్చకు పుల్ స్టాప్ పడింది అనుకుంటుండగా, ఇప్పుడు కీలక నేతలు ఇద్దరు మధ్య వార్ మొదలైంది.విజయవాడలో వంగవీటి రాధా ,బోండా ఉమాలు బలమైన నేతలుగా ఉన్నారు.
వీరిద్దరూ టిడిపిలోనే కొనసాగుతున్నారు.వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతుండగా.
సోషల్ మీడియా ద్వారా ఇరువురు నేతల అనుచరులు పోస్టింగ్స్ పెడుతూ ఉండడం వైరల్ గా మారింది.
విజయవాడ సెంట్రల్ సీటు విషయమై ఒకరిపై ఒకరు సోషల్ మీడియా ద్వారా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు .ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోస్టులు పెడుతున్నారు.వంగవీటి రాధాను టిడిపి నమ్మడం లేదంటూ మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి .రాధ వర్గం బోండా ఉమ( Bonda uma ) వర్గం పై ఆరోపణల చేయడం , దీనికి ప్రతిస్పందనగా బోండా ఉమా వర్గానికి కౌంటర్ ఇస్తూ రాధ వర్గం కౌంటర్ పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఇద్దరు నేతలు మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా నడుస్తుండడం తో, టిడిపి అధిష్టానంకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.
ఈ ఇద్దరు నేతలు విజయవాడ సెంట్రల్ సీటును ఆశిస్తూ ఉండడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు అసంతృప్తికి గురై పార్టీకి నష్టం చేకూరుస్తారనే భయమూ నెలకొంది .
వంగవీటి రాధా( Vangaveeti Radha ) టీడీపీలో యాక్టివ్ గా ఉండడం లేదు.ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది.దీనిని రాధ ఇటీవలె ఖండించారు .తాను టిడిపిలో కొనసాగుతానని ప్రకటించారు.ఇప్పుడు బోండా ఉమా తో విభేదాలు తలెత్తడంతో రాజకీయంగా రాధ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరి కీలక నేతల మధ్య మొదలైన వివాదానికి పుల్ స్టాప్ పెట్టే దిశగా టిడిపి అధిష్టానం రంగంలోకి దిగింది.