రాధా ఉమల వార్ ఏంటి ? ఆ ‘ సీటు ‘ కొసమేనా ?
TeluguStop.com
విజయవాడ టిడిపి( Vijayawada TDP ) లో ఏదో ఒక వార్ నిత్యం నడుస్తూనే ఉంటోంది .
మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) , కేశినేని చిన్నిల( Keshineni Chinni ) వ్యవహారం తలనొప్పిగా మారింది.
నాని వైసీపీలో చేరడంతో అక్కడితో ఆ రచ్చకు పుల్ స్టాప్ పడింది అనుకుంటుండగా, ఇప్పుడు కీలక నేతలు ఇద్దరు మధ్య వార్ మొదలైంది.
విజయవాడలో వంగవీటి రాధా ,బోండా ఉమాలు బలమైన నేతలుగా ఉన్నారు.వీరిద్దరూ టిడిపిలోనే కొనసాగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతుండగా.
సోషల్ మీడియా ద్వారా ఇరువురు నేతల అనుచరులు పోస్టింగ్స్ పెడుతూ ఉండడం వైరల్ గా మారింది.
"""/" /
విజయవాడ సెంట్రల్ సీటు విషయమై ఒకరిపై ఒకరు సోషల్ మీడియా ద్వారా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు .
ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోస్టులు పెడుతున్నారు.వంగవీటి రాధాను టిడిపి నమ్మడం లేదంటూ మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి .
రాధ వర్గం బోండా ఉమ( Bonda Uma ) వర్గం పై ఆరోపణల చేయడం , దీనికి ప్రతిస్పందనగా బోండా ఉమా వర్గానికి కౌంటర్ ఇస్తూ రాధ వర్గం కౌంటర్ పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఇద్దరు నేతలు మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా నడుస్తుండడం తో, టిడిపి అధిష్టానంకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.
ఈ ఇద్దరు నేతలు విజయవాడ సెంట్రల్ సీటును ఆశిస్తూ ఉండడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు అసంతృప్తికి గురై పార్టీకి నష్టం చేకూరుస్తారనే భయమూ నెలకొంది .
"""/" /
వంగవీటి రాధా( Vangaveeti Radha ) టీడీపీలో యాక్టివ్ గా ఉండడం లేదు.
ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది.దీనిని రాధ ఇటీవలె ఖండించారు .
తాను టిడిపిలో కొనసాగుతానని ప్రకటించారు.ఇప్పుడు బోండా ఉమా తో విభేదాలు తలెత్తడంతో రాజకీయంగా రాధ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరి కీలక నేతల మధ్య మొదలైన వివాదానికి పుల్ స్టాప్ పెట్టే దిశగా టిడిపి అధిష్టానం రంగంలోకి దిగింది.
విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు