మంచు విష్ణు నెక్స్ట్ సినిమా ఏంటంటే..?

మోహన్ బాబు కొడుకుల్లో పెద్ద కొడుకు అయిన మంచు విష్ణు హిట్టు ప్లాప్ తో సంభందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు కెరియర్ లో ఇప్పటికి 20 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన ఆయనికి 2 ,3 సినిమాలని మినహా ఇస్తే మిగిలినవన్ని ప్లాప్ లు కావడం మనం చూస్తూనే ఉన్నాం.

అయిన కూడా ఆయన సినిమాల మీద ఉన్న ఇంటరెస్ట్ వల్ల, ప్యాషన్ వల్ల ఆయన సినిమాలని విడిచి పెట్టకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

ఆయన రీసెంట్ గా చేసిన జిన్నా మూవీ భారీ డిజాస్టర్ అయింది దానికి తోడు మంచు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ కనిపించిన లేదా మాట్లాడినా ఆ కెమెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.నిజానికి వీళ్లు ఏం మాట్లాడిన ట్రోలర్స్ వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు.

ఇక జిన్నా సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు వేరే ఏ సినిమాకి కూడా విష్ణు కమిట్ అవ్వకుండా ఖాళీగానే ఉన్నట్టు తెలుస్తుంది అయితే అప్పట్లో డైరెక్టర్ శ్రీను వైట్ల తో కలిసి ఢీ 2 అనే సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ మళ్లీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదనే విషయం అయితే తెలుస్తుంది.ఇక మరి నెక్స్ట్ విష్ణు చేయబోయేది ఏ సినిమా అని ఇండస్ట్రీ లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఇక రీసెంట్ గానే విష్ణు వాళ్ల తమ్ముడు అయిన మనోజ్ కూడా భూమా మౌనిక ని పెళ్లి చేసుకొని తాను కూడా ఒక ఇంటి వాడు అయ్యాడు.

ఇక ఆ విషయం పక్కన పెడితే మంచు విష్ణు మళ్లీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం ఈ మధ్య చర్చినీయాంశం అయింది.అయితే అందుతున్నసమాచారం ప్రకారం మంచు విష్ణు మళ్లీ ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అనే విషయం అయితే తెలుస్తుంది.అతను ఎవరు అనే విషయం తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Advertisement
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

తాజా వార్తలు