అవును, ఇపుడు ఇదే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.గత కొన్నాళ్లుగా భారత్, పాక్ సరిహద్దుల్లో( India Pakistan Border ) అసలు ఏం జరుగుతోందని చాలామంది చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.
కానీ ఎలాంటి సమాచారం లేదు.గతంలో అయితే అక్కడ చినుకు చిటుక్కుమన్నా ఏం జరిగిందో అని మీడియాలు కోడై కుసేవి.
ఇపుడు ఆ ఊసే లేదని చెప్పుకోవాలి.ఇప్పుడు మీడియాకి( Media ) ఉప్పందించే వాళ్లు లేకపోయారో, లేదంటే సరిహద్దుల్లో అసలు నిజంగా ఏమీ జరగటం లేదో తెలియడంలేదు.
కాగా సరిహద్దుల్లో అయితే ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగానే ఉన్నట్లు తెలుస్తుంది.కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అంతా ప్రశాంతం అని భావిస్తున్నారు.

అయితే పాకిస్తాన్ కు సంబంధించిన సైనిక చీఫ్ మాత్రం భారత్ వాయు దళానికి సంబంధించిన యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తాజాగా ప్రకటించారు.ఈ క్రమంలో భారత్ కాశ్మీర్ ( Kashmir ) విషయంలో చేస్తున్నది అస్సలు కరెక్ట్ కాదుఅని, దీనికి మూల్యం చెల్లించుకుంటారని గప్పాలు పలికిన పరిస్థితి.అయితే దీనిపై మన సైనికులు ఎవరూ స్పందించకపోవడం కొసమెరుపు.అయితే పాకిస్తాన్ వాళ్ళు చెబుతున్నది ఏంటంటే గత 4 నెలల్లో భారత్ 56 సార్లు పాకిస్తాన్ స్థావరాలపై దాడులు చేసిందని చెబుతున్నారు.

ఈ విషయంలో విశ్లేషకులు ఏమంటున్నారంటే… అసలు, ఇలాంటి కాల్పుల విరమణ ఒప్పందాలు అనే విషయాలు తప్పేది పూర్తిగా పాకిస్తాన్ అని చెప్పుకొస్తున్నారు.ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు ఎన్నో మనం చూసాము.ఇప్పటివరకు మనం తెలిసిందీ, చూసింది కూడా అదే.మన ముందు తరాలు కావచ్చు, నేటి తరాలు కావచ్చు… ఇలాంటి దుర్మార్గపు పనులు చేసేది వారే అని చెబుతున్నారు.అయితే అభాండాలు భారత్ మీద, భారత్ సైన్యం మీద నెట్టేసి ఏ పాపం ఎరుగని నంగనాచిలా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం.







