సోషల్ మీడియాలో నిత్యం ఎన్ని వీడియోలు వైరల్ అయినా, అందులో కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి.అందులోనూ ఇన్నోవేటివ్ వీడియోలకు చాలా గిరాకీ ఉంటుంది.
ప్రముఖులు కూడా వాటిని మెచ్చుకొని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వుంటారు.ఇక్కడ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు అయినటువంటి హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా( Harsh Goenka, Anand Mahindra ) గురించి మాట్లాడుకోవాలి.
వీరు తరచుగా సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు చాలా మందిని ఆకట్టుకుంటాయి.తమకు ఇన్నోవేటివ్ గా అనిపించే వీడియోలు వీరు తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి వారికి మంచి ప్రాచుర్యం లభించేలా చేస్తూ వుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.ఆ వీడియోలో కుర్రాళ్ల క్రియేటివిటీని హర్ష్ గోయెంకా ప్రశంసించారు.ఆ వైరల్ వీడియోలో ఓ సెవెన్ సీటర్ బైక్‌పై కుర్రాళ్లు వెళ్లడం మనం గమనించవచ్చు.ఆ బైక్ నడిచేది పెట్రోల్‌తోనో, కరెంట్‌తోనో కాదు.సోలార్ ఎనర్జీతో కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది.అవును సూర్యకాంతిని ఇంధనంగా తీసుకుని ఆ వాహనం ముందుకెళ్తుంది.
ఆ వాహనాన్ని పూర్తిగా స్క్రాప్‌తో తయారు చేయడం విశేషం.

ఆ బైక్ పైన సోలార్ ప్యానెల్స్‌ను( Solar panels ) అమర్చడం ఇక్కడ చూడవచ్చు.భారతీయులు తయారు చేసే ఇలాంటి సృజనాత్మక వస్తువులు చూస్తే తనకెంతో గర్వకారణంగా ఉంటుందని హర్ష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.కాగా దీని నిర్మాణానికి 8 నుంచి 10 వేల రూపాయలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది.
అదేవిధంగా బైక్‌పై అమర్చిన సోలార్ ప్యానెల్ ఎండ, వాన నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.ఇది సౌరశక్తితో 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని దానిని తయారు చేసిన కుర్రాడు చెప్పుకొచ్చాడు.
కాగా ఇలాంటి వాహనాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావాలని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







