సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతికొద్ది మంది మంచి డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల( Srikanth addala ) ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు మంచి హిట్లు అందుకున్నాయి.అందుకే ఇప్పుడు ఆయన చేస్తున్న పెదకాపు అనే సినిమా( Peddha Kapu ) కూడా ఈ నెల చివరి వారం లో మన ముందుకురాబోతుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన ట్రైలర్ కూడా వచ్చింది.ఆ ట్రైలర్ లో డైరెక్టర్ సినిమాని చాలా కొత్తగా తీసినట్టు గా కనిపిస్తుంది.శ్రీకాంత్ అడ్డాల అంటే సాఫ్ట్ సినిమాలు తీస్తాడు అనే ఒక మార్క్ కి స్వస్తి చెప్పి ఇప్పుడు ఏకంగా చాలా మాస్ సినిమానే తీసాడు నిజానికి ఈయన చేసిన సినిమాలకి దీనికి అసలు సంబంధమే ఉండదు…

శ్రీకాంత్ అడ్డాల అంటే అందరికి కొత్త బంగారు లోకం( Kotha Bangaru Lokam ) సినిమా గుర్తుకు వస్తుంది ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ అనే చెప్పాలి.నిజానికి ఈయన చేసిన సినిమాల లిస్ట్ చూస్తే మనకు అర్థం అవుతుంది అయితే ఈయన కూడా ప్రస్తుతం రూట్ మార్చి ఇలా మాస్ సినిమాలు తీయడం చూస్తుంటే ప్రతి డైరెక్టర్ కూడా మాస్ జపం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని డైరెక్షన్ చేయడమే కాకుండా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేసాడు అది ట్రైలర్ లోనే మనకు కనిపిస్తుంది.అయితే శ్రీకాంత్ అడ్డాల విషయం పక్కన పెడితే సాఫ్ట్ మ్యూజిక్ ఇస్తూ మెలోడీ సాంగ్స్ పండించే మిక్కీ జె మేయర్ కూడా ఈ సినిమాలో ఊర మాస్ అనేలా మ్యూజిక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా హిట్ అయితేనే శ్రీకాంత్ అడ్డాల కి సినీ కెరియర్ ఉంటుంది లేకపోతే శ్రీకాంత్ అడ్డాల సినిమా కెరియర్ చాలా వరకు క్లోజ్ అయినట్టే అయితే ఈ సినిమాతో హిట్ కొడితే మళ్లీ ఆయన దగ్గరికి పెద్ద హీరోలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది.చూడాలి మరి ఏం జరుగుతుందో…
.







