టీ కప్పులో తుఫాన్.. ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవి

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ హోటల్ వద్ద చాయ్ తాగుదామని వెళ్లగా అక్కడ ఆర్డర్ చెప్పి త్రాగిన తర్వాత అడుగు భాగంలో టీ కప్పులో (క్లోస్టెరియం) అనే క్రిమి కీటకం వచ్చిన మాదిరిగా అందులో పురుగు చనిపోయి ఉండడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు.

ఇదేంటని ఆ హోటల్ యజమానిని నిలదీయగా ఆ టీ గ్లాస్ ను అక్కడి నుండి తీసేసాడు.

అయినా టీ డబ్బులు దగ్గర ఉండి మరీ వసూలు చేశాడు.హోటల్ లలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతుందని టీ చెప్పిన వ్యక్తి వెను తిరిగాడు.

ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎల్లారెడ్డిపేట మండలంలో తనిఖీలు నిర్వహించడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చికెన్ వ్యర్థాలు పారవేయడం వల్ల కుక్కలు సైతం చిన్నపిల్లలను వెంబడిస్తున్నాయి.

ఏక్కడ పడితే అక్కడ వ్యర్ధాలు పాడవేయడం వల్ల గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోవాలని అప్పుడప్పుడు అపరిశుభ్రతగా ఉన్న ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు

Latest Rajanna Sircilla News