తరచూ ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా.. కారణాలేంటో ఆలోచించారా?

ఒళ్ళు నొప్పులు.( Body pains ) దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.

శ్రమకు మించి పనులు చేసినప్పుడు, జర్నీ చేసినప్పుడు, అలసిపోయినప్పుడు, గంటలు తరబడి కూర్చున్నప్పుడు.ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి.

అయితే కొందరికి మాత్రం తరచూ ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి.కనీసం వారంలో నాలుగైదు సార్లు అయినా ఒళ్ళు నొప్పులు అంటూ మందులు మింగుతుంటారు.

అయితే ఇలా తరచూ ఒళ్ళు నొప్పులు రావడానికి కారణాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇలా పదే పదే ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి అంటే దాని వెనక కొన్ని బ‌ల‌మైన కారణాలు ఉన్నాయి.

Advertisement

డీహైడ్రేషన్..( Dehydration ) తరచూ ఒళ్ళు నొప్పులు రావడానికి ఒక కారణం.

ఒంట్లో నీటి శాతం( Percentage of water ) తగ్గిపోయినప్పుడు నొప్పులకు దారితీస్తుంది.అందుకే శరీరానికి అవసరమయ్యే వాటర్ ను కచ్చితంగా అందించాలి.

అలాగే కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల కూడా పదే పదే ఒళ్ళు నొప్పులు విసిగిస్తాయి.రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.

కంటి నిండా నిద్ర ఉన్నప్పుడు మన శరీరం శక్తి వనరులను పునరుత్పత్తి చేసుకుంటుంది.ఎవరైతే ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోతారో వారి శరీరం శక్తి వనరులను భర్తీ చేసుకోలేదు.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

ఫలితంగా బాడీ అలసిపోయి నొప్పులు మొదలవుతాయి.అందుకే కంటి నిండా నిద్ర ( Sleep )ఉండేలా చూసుకోవాలి.ఐరన్, విటమిన్ డి వంటి పోషకాల కొరత వల్ల తరచూ ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడతాయి.

Advertisement

కాబట్టి పదే పదే ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటే ఆయా పోషకాలు మెండుగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.ఇక మానసిక ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే ఒళ్ళు నొప్పులకు కూడా అంతే దూరంగా ఉంటారు.

ఒత్తిడి వల్ల మెదడు మాత్రమే కాదు శరీరం కూడా అలసటకు లోనవుతుంది.అందువల్లే నొప్పులు వస్తుంటాయి.కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండండి.

తాజా వార్తలు