రాగి మిల్క్.. రోజు ఉద‌యాన్నే తాగితే ఎన్ని ఆరోగ్య లాభాలో!

రాగులు.వీటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

ఫింగర్ మిల్లెట్స్ అని పిల‌వ‌బ‌డే రాగుల్లో కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, జింక్, పొటాషియం, విట‌మిన్ బి, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.అందుకే రాగులు ఆరోగ్యప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అందులోనూ ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో రాగి మిల్క్ త‌యారు చేసుకుని ఉద‌యాన్నే తాగితే బోలెడ‌న్ని ఆరోగ్య లాభాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం రాగి మిల్క్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు దాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటీ.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌, ఆఫ్ గ్లాస్ వాట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకుని ఉండ‌లు లేకుండా క‌లుపుకుంటూ ప‌ది నిమిషాల పాటు చిన్న మంట‌పై మ‌రిగించాలి.

పాలు కాస్త చిక్క‌గా మారిన త‌ర్వాత రుచికి స‌రిప‌డా బెల్లం పొడి, చిటికెడు యాల‌కుల పొడి వేసి మ‌రో రెండు, మూడు నిమిషాల పాటు మ‌రిగిస్తే రాగి మిల్క్ సిద్ధ‌మైన‌ట్లే.సూప‌ర్ టేస్ట్‌ను క‌లిగి ఉండే ఈ రాగి మిల్క్ ను ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ప్ర‌తి రోజు బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

Advertisement
What Are The Health Benefits Of Drinking Ragi Milk In The Morning, Ragi Milk, Dr

అతి ఆక‌లి త‌గ్గుముఖం ప‌డుతుంది.ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు ఈ రాగి మిల్క్‌ను రోజూ తాగితే శ‌రీరానికి కావాల్సిన ఐర‌న్ అందుతుంది.దాంతో ర‌క్త‌హీన‌త దూరం అవుతుంది.

What Are The Health Benefits Of Drinking Ragi Milk In The Morning, Ragi Milk, Dr

రాగి మిల్క్‌లో కాల్షియం కంటెంట్ దండిగా నిండి ఉంటుంది.అందువ‌ల్ల దీనిని రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే ఎముక‌లు బ‌లంగా మార‌తాయి.వృద్ధుల్లో ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తుంది.

అంతేకాదు, రాగి మిల్క్ ను రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరం కూల్‌గా ఉంటుంది.నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

డీహైడ్రేష‌న్‌, హీట్ స్ట్రోక్ వంటి వాటికి సైతం దూరంగా ఉండొచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు