చన్నీటి స్నానంతో బ‌రువు త‌గ్గొచ్చ‌ని మీకు తెలుసా?

నేటి కాలంలో చిన్నా.పెద్ద అని తేడా లేకుండా అంద‌రూ అధిక బ‌రువు స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.

ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తారు.నోరు క‌ట్టేసుకుని.

ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.కాని, ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు.

ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.చ‌న్నీటి స్నానంతో బ‌రువు త‌గ్గుతారు అంటే న‌మ్ముతారా.? మీరు న‌మ్మినా.న‌మ్మ‌క‌పోయినా ఇదే నిజం.అవును! చన్నీటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది.

Advertisement

దీంతో శరీరంలోని కొవ్వు కగుతుంది.అందువల్ల రోజూ చన్నీటి స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల వరకు బరువు తగ్గుతార‌ని నిపుణులు అంటున్నారు.

చ‌న్నీటి స్నానం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

చ‌న్నీటి స్నానం చేయ‌డం వ‌ల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.త‌ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ప్ర‌తిరోజు ఉద‌యం చ‌న్నీటితో స్పానం చేస్తే.రోజంతా ఫ్రెష్‌గా ఉండ‌డంతో పాటు మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?

అంతేకాదు, ప్ర‌తిరోజు చన్నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అదే స‌మ‌యంలో రోగాలతో పోరాడే తెల్లరక్త కణాల సంఖ్య పెరుగుతుంది.అలాగే చ‌న్నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల‌ చర్మం నుండి హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది.మ‌రియు చర్మ రంధ్రాలను మూసుకునేలా చేస్తుంది.

చ‌న్నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌రో ప్ర‌యోజ‌నం ఏంటంటే.డిప్రెషన్, ఒత్తిడి దూరం చేస్తుంది.

తాజా వార్తలు