ఆ విషయంలో సమంత చైతన్య రాజీకి వస్తారా.. వేరయ్యే ఛాన్స్ తక్కువంటూ?

అక్కినేని హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు.

అయితే విడిపోయిన తర్వాత సమంత, చైతన్య ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇద్దరూ ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు.

అయితే విడిపోవడానికి ముందు సమంత, చైతన్య కలిసి కొన్ని యాడ్స్ లో నటించారు.ప్రస్తుతం ఆ యాడ్స్ పరిస్థితి ఏమిటనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొన్ని యాడ్స్ లో చైసామ్ భార్యాభర్తలుగా కనిపించారు.కొన్ని యాడ్స్ ఇద్దరికీ జాయింట్ వెంచర్లుగా ఉన్నాయి.

Advertisement

కోల్గేట్ సాల్ట్ కు సమంత ప్రమోటర్ గా వ్యవహరిస్తుండగా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ కు నాగచైతన్య ప్రమోటర్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం చైసామ్ విడిపోయిన నేపథ్యంలో ఈ యాడ్ పరిస్థితి ఏమిటనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ జాయింట్ వెంచర్ లో ఇద్దరూ నటిస్తారా లేక ఎవరైనా ఆ బ్రాండ్ ను వదులుకుంటారా? చూడాల్సి ఉంది.ఇద్దరూ బ్రాండ్స్ విషయంలో రాజీకి వస్తే మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.విడాకుల వల్ల అటు సమంత ఇటు నాగచైతన్య ఎంతో బాధ పడ్డారనే సంగతి తెలిసిందే.

యాడ్స్ విషయంలో చైసామ్ ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.చైతన్య నటించిన బంగార్రాజు, థాంక్యూ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదల కానున్నాయి.సమంత నటించిన శాకుంతలం రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడనుంది.

విడాకుల తర్వాత సమంతకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరగడంతో పాటు భారీస్థాయిలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం.విడాకుల తర్వాత సమంత స్పెషల్ సాంగ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు