కరోనాతో సహజీవనంపై ఇప్పుడేమంటారు..? చంద్రబాబు అండ్ కో.. చెప్పాలి

కరోనాతో సహజీవనంపై ఇప్పుడేమంటారు.? చంద్రబాబు అండ్ కో. చెప్పాలి.  కోవిడ్ మహమ్మారి ఎప్పటికీ ఉండిపోయే వ్యాధిగా మారుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.

 What About Cohabitation With Corona Now Chandrababu And Co Say , Jaganmohanredd-TeluguStop.com

ఏడాది క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే విషయంపై కోవిడ్ తో సహజీవనం తప్పదని ప్రజలకు చెబితే వెకిలి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏమంటారని రాజ్యసభ సభ్యులు విజయసాయ రెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.జాతీయ ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ దళితులపై ఎక్కడైనా దాడులు, నేరాలు జరిగినా ఫిర్యాదు చేసి  న్యాయం పొందొచ్చు.

అలాంటి అత్యున్నత కమిషన్ సభ్యులు రాష్ట్రాన్ని సందర్శించి రమ్య కేసులో ప్రభుత్వం వేగంగా, మానవతా దృక్పథంతో స్పందించిన తీరును ప్రశంసించిన విషయం మాలోకానికి వినిపిస్తోందా.? అంటూ మరో ట్వీట్ చేశారు.టీడీపీ అంటేనే తెలుగు దళితుల ద్రోహుల పార్టీ అని మీలో మీరే ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవడం ఏంటయ్యా అంటూ ప్రశ్నించారు.అఖండ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం ఐదేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది.2024 తర్వాత  చంద్రబాబు తిరస్కృతుడిగానే మిగిలిపోతాడు అని మరో ట్వీట్ చేశారు.రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వచ్చే రెండేళ్లలో 36 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చి 75 వేల మందికి పైగా ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube