ఏంటీ కుర్రాడు.. మ‌రీ ఇంత సాహ‌స‌మా చూస్తే న‌మ్మ‌లేరు..!

మనలో చాలా మంది వ్యక్తులు స్కేటింగ్ చేస్తుంటారు.

స్కేటింగ్ ఏ గ్రౌండ్ లోనో లేదా చివరికి రోడ్డు మీదరనో చేయడం మనం చూసాం కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఎత్తైన వంతెన మీద స్కేటింగ్ చేశాడు.

అతడు స్కేటింగ్ చేసిన వీడియోన చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.అటువంటిది ఏకంగా చేసిన అతడికి ఎలా అనిపించిందో.

ఇంతకీ విషయమేంటంటే.అసలు ఇటువంటి సాహసాలు ఫేమ్ కావాలని చేస్తారో లేక ఎందుకో చేస్తారో కూడా తెలియదు.

కానీ కొన్ని సార్లు వీళ్లు చేసే సాహసాలు మిస్ ఫైర్ అవుతుంటాయి.తద్వారా బంగారం లాంటి జీవితాలను కోల్పోవాల్సి వస్తుంది.

Advertisement

ఇలానే ఓ వ్యక్తి తనకు ఎక్కడ స్థలం దొరకనట్టు ఓ ఎత్తైన వంతెన మీద స్కేటింగ్ చేశాడు.ఆ వ్యక్తి ఎత్తైన వంతెన మీదకి వెళ్లి.

స్కేట్ బోర్డును తన కాళ్లకు అమర్చుకుని అమాంతం దూకేస్తాడు.చూడడానికి మనకు భయంగా ఉన్నా.

అతడు పారాచూట్ కట్టుకుని దూకాడని తెలిసి కొంచెం రిలీఫ్ కలుగుతుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతూ.సాహసం చేసిన వ్యక్తిని తమ కామెంట్లతో తిట్టి పోస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇలాంటివి ఎంత మాత్రం మంచివి కావని అంటున్నారు.ఇది ఏ మాత్రం ఫన్ లా లేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

స్కేటింగ్ చేసేందుకు ఎక్కడా ప్లేసే దొరకలేదా అని తిడుతున్నారు.ఇదిలా ఉండగా కొంత మంది మాత్రం ఆ వ్యక్తి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా ఇలాంటి రిస్కీ ఫీట్లు చేయడం ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం.ఏ మాత్రం అటూ ఇటూ అయిన ఇలా ఫీట్లు చేసే వారి ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం.

తాజా వార్తలు