అమెరికాలో మహిళల కోసం ప్రత్యెక తెలుగు సంఘం

అమెరికా వ్యాప్తంగా తెలుగు వారి కోసం వివిధ తెలుగు సంఘాలు ఎన్నో ఉన్నాయి.

ప్రాంతాల వారిగా, రాష్ట్రాల వారిగా ఉన్న తెలుగు సంఘాలని లెక్కపెట్టుకుంటే కోకొల్లలుగా ఉన్నాయి.

తెలంగాణా కి చెందిన వారు ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు మరొక సంఘాన్ని చేసుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న సంఘాలు కూడా ఉన్నాయ్.

ఈ క్రమంలో మహిళల కోసం కూడా ఓ సంఘం ఉండాలని భావించిన ఓ మహిళా ఎన్నారై అమెరికాలో ప్రత్యేకంగా తెలుగు మహిళల కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేసింది.గతంలో వివిధ తెలుగు సంఘాలలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఎన్నారై ఝాన్సీ రెడ్డి, ఆమె ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ని ఏర్పాటు చేశారు.

ఈ సంఘం ముఖ్య ప్రారంభ కార్యక్రమాన్ని సెప్టెంబరు 29న సిలికాన్ వ్యాలీలో ప్రారంభించనున్నారు.ప్రముఖ సినీ నటి, తెలుగు మహిళ , పార్లమెంట్ సభ్యురాలు అయిన సుమలత కి ఈ సభలో జీవిత సాఫల్య పురస్కారం అందచేస్తామని ఝాన్సీ రెడ్డి తెలిపారు.

Advertisement

అమెరికా వ్యాప్తంగా ఉంటున్న తెలుగు మహిళలని ఒకే తాటిపైకి తీసుకురావడం, తెలుగు బాష, సాంప్రదాయాలని, కళలని పరి రక్షించడం ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంస్థ సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

యూకే : విదేశీ ప్రభుత్వాధికారికి లంచం .. భారత సంతతి వ్యాపారవేత్తపై అభియోగాలు
Advertisement

తాజా వార్తలు