తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు

వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా)నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గర లోని పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం వద్ద కొనసాగుతుంది.

ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంది.

ఇది రానున్న 36 గంటల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉంది.ఈరోజు సగటు సముద్ర మట్టం వద్ద ద్రోణి జైసల్మేర్, ఉదయపూర్, జల్గావ్, రామగుండం గుండా వెళుతుంది.

మరియు అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం మీదుగా వెళుతుంది.నిన్న దక్షిణ కొంకణ్ నుండి ఉన్న ద్రోణి ఈ రోజు ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరంలో ఉన్న పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది.రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.వాతావరణ హెచ్చరికలు (weather warnings)ఈరోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.

ఎల్లుండి భారీ వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.ఈరోజు నుండి మూడు రోజుల పాటు ఉరుములు మరియు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో తెలంగాణ రాష్ట్రముపై వీచే అవకాశం ఉంది.

Advertisement
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

Latest Latest News - Telugu News