తెలంగాణలో( Telangana ) ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రూ.500 లకే సిలిండర్ ఇస్తున్నామన్న ఆయన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.నిజమైన లబ్ధిదారులందరికీ పథకాలు అందుతాయన్నారు.
మాట ఇస్తే కాంగ్రెస్( Congress ) వెనుకడుగు వేయదని చెప్పారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.

తాము ఇచ్చిన గ్యారెంటీలను ప్రజలు నమ్మే తమకు అధికారం ఇచ్చారన్నారు.ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.నూటికి నూరు శాతం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు.కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ( Sonia Gandhi ) మాట ఇస్తే అది శిలాశాసనమని తెలిపారు.
ఈ క్రమంలోనే దేశంలో తెలంగాణ నమూనా తీసుకొస్తామని వెల్లడించారు.







