Deputy CM Bhatti : అసాధ్యాన్ని సాధ్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో మరో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) ప్రారంభించింది.ఈ మేరకు సెక్రటేరియట్ లో పథకాలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ), మంత్రులు ప్రారంభించారు.

 Congress Aim Is To Make The Impossible Possible Deputy Cm Bhatti-TeluguStop.com

ఈ కార్యక్రమంలో శానససభ, శాసనమండలి సభ్యులతో పాటు హైదరాబాద్ మేయర్, అధికారులు పాల్గొన్నారు.ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి ( Deputy CM Bhatti )తెలిపారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్( Gas cylinder for Rs.500 ) అందిస్తామని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తామన్నారు.

ఈ క్రమంలో మార్చి నుంచి జీరో బిల్లు వస్తుందని తెలిపారు.బడుగు, బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూనే హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న భట్టి అసాధ్యాన్ని సైతం సాధ్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube