ఆలోచన చేసి ప్రభుత్వంకు వెన్నుదన్నుగా నిలవాలి : మంత్రి కే తారక రామారావు

ఆలోచన చేసి ప్రభుత్వంకు వెన్నుదన్నుగా నిలవాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమం లో బోధన అందిస్తున్నాం.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంగ్లంలో మాట్లాడుతుంటే నా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.

సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎడారులను తలపించేవి.ఇప్పుడు ఏ చెరువు చూసినా నిండు కుండ నే నర్మాల డ్యాం ను నింపాలని ఈ ప్రాంత ప్రజలు గంభీరావుపేట నుండి హైదరాబాద్ లోని సిఎం ను కలిసేందుకు వెళ్లిన రోజులు గుర్తుకు తెచ్చుకుండి.

ప్రతిగా అప్పటి పాలకులు మొక్కుబడిగా శిలాఫలకం వేసి చేతులు దులుపుకునే వారు.ఇప్పుడు నర్మాల డ్యాం 365 రోజులు నిండు కుండలా ఉంటుంది.

కుడవెల్లి నుంచే కాకుండా ప్యాకేజి -9 ద్వారా నర్మాల డ్యాం ను నింపనున్నాం.స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్( cm kcr ) అన్ని గ్రామీణ నియోజకవర్గాలను అభివృద్ధి చేశారు.

Advertisement

రైతుల ఖాతాలో 73 వేల కోట్లు జమ చేశారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతు బీమా సకాలంలో ఎరువులు ,విత్తనాలను అందజేస్తున్నారు.9 ఎండ్లలో గంభిరావు పేట మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం.చెరువును అభివృద్ధి చేయడంతో పాటు కేజీ టు పీజీ క్యాంపస్ ను ఏర్పాటు చేశాం.ఈ రోజు 13.5 కోట్లతో లింగన్న పేట - గంభిరావు పేట మధ్య హై లెవెల్ వంతెన కు శంకుస్థాపన చేస్తున్నాం.వచ్చే వర్షాకాలంలోగా దీనిని పూర్తి చేస్తాం నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెన లను నిర్మిస్తాం.

గతంలో మున్సిపాలిటీ గా ఉన్న గంభిరావు పేట ను తిరిగి మున్సిపాలిటీ గా చేస్తాం.గంభిరావు పేట పాత జీపి వద్ద రూ.3 కొట్లతో అధునాతన మార్కెట్ ను నిర్మిస్తాం.- రూ.3 కోట్లతో లక్ష్మి పూర్ రోడ్డును నిర్మించనున్నాం.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లోని 640 గుడిసెలు ,432 రేకుల షెడ్లు, 907 శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారికి మొత్తం 1967 మందికి ప్రథమ ప్రాధాన్యతగా గృహలక్ష్మి కిందను మంజూరు చేస్తున్నాం బ్రతికి ఉన్నన్నాల్లు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కు సేవ చేస్తూనే ఉంటాం.

గంభిరావుపేట బహిరంగ సభలో మంత్రి కే తారక రామారావు స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు వేసిన సిఎం కేసిఆర్ కాకుండా ఇంకెవ్వరైన ఉన్నారా? వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సీఎం కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా ఇస్తున్నారా?రైతు బీమా ( Rythu Bima )లాంటి కార్యక్రమాలను ఇంకె రాష్ట్రంలో అమలు చేస్తున్నారా? వీటన్నింటి పై ఆలోచన చేసి ప్రభుత్వంకు వెన్నుదన్నుగా నిలవాలనీ మంత్రి కే తారక రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బుధవారం గంభీరావుపేట మండలంలోని నర్మాల, కోళ్ళమద్ది,లింగన్నపేట గంభీరావుపేటలకు సంబంధించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

అనంతరం మంత్రి మాట్లాడారు.”ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించుకున్నాం.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

సిరిసిల్లకు రావడం తక్కువ అయ్యింది.ఎవరూ తిట్టుకోవద్దు.

Advertisement

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం.మానేరులో నిల్వ చేసుకున్నాం.

రైతులను దృష్టిలో పెట్టుకుని ఎన్నో గొప్ప ఆలోచనలు చేశారు.రైతుల ఖాతాలో 73వేల కోట్ల రూపాయలు వేసిన ఘనత కేసీఆర్ ది.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమం లో బోధన అందిస్తున్నామన్నారుప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంగ్లంలో మాట్లాడుతుంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గా నా గుండె గర్వంతో ఉప్పొంగుతుందన్నారు.సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎడారులను తలపించేవి.

ఇప్పుడు ఏ చెరువు చూసినా నిండు కుండ నే నని చెప్పారు.నర్మాల డ్యాం ను నింపాలని ఈ ప్రాంత ప్రజలు గంభీ రావుపేట నుండి హైదరాబాద్ లోని సిఎం ను కలిసేందుకు వెళ్లిన రోజులు గుర్తుకు తెచ్చుకొండి అని చెప్పిన మంత్రి .ప్రతిగా అప్పటి పాలకులు మొక్కుబడిగా శిలాఫలకం వేసి చేతులు దులుపుకునే వారన్నారు.ఇప్పుడు నర్మాల డ్యాం 365 రోజులు నిండు కుండలా ఉంటుందన్నారు.

కుడవెల్లి నుంచే కాకుండా ప్యాకేజి -9 ద్వారా నర్మాల డ్యాం ను నింపనున్నామని చెప్పారు.స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని గ్రామీణ నియోజకవర్గాలను అభివృద్ధి చేశారన్నారు.

రైతుల ఖాతాలో 73 వేల కోట్లు జమ చేశారన్నారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతు బీమా సకాలంలో ఎరువులు , విత్తనాలను అందజేస్తున్నారనీ చెప్పారు.9 ఎండ్లలో గంభిరావు పేట మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు.చెరువును అభివృద్ధి చేయడంతో పాటు కేజీ టు పీజీ క్యాంపస్ ను ఏర్పాటు చేశామన్నారు.ఈ రోజు 13.5 కోట్లతో లింగన్నపేట - గంభిరావు పేట( Gambhiraopet ) మధ్య హై లెవెల్ వంతెన కు శంకుస్థాపన చేస్తున్నాం.వచ్చే వర్షాకాలంలోగా దీనిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెన లను నిర్మిస్తామన్నారు.గతంలో మున్సిపాలిటీ గా ఉన్న గంభిరావుపేట ను తిరిగి మున్సిపాలిటీ గా చేస్తామన్నారు.గంభిరావు పేట పాత జీపి వద్ద రూ.3 కొట్లతో అధునాతన మార్కెట్ ను నిర్మిస్తామన్నారు రూ.3 కోట్లతో లక్ష్మి పూర్ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు.జిల్లావ్యాప్తంగా 465 గుడిసెలు, 432 రేకుల షెడ్లు, 907 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి.

మొత్తం 1,967. వీరందరికీ గృహ లక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టేస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు చైర్మన్ గడ్డం నర్సయ్య, సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ), అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News