చిత్తశుద్ధితో పోలవరం నిర్మాణం చేపడుతున్నాము - మంత్రి అంబటి రాంబాబు

ఏలూరు: జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిసి కామెంట్స్.గైడ్ బండ్ పరిశీలించిన నిపుణుల బృందంతో ఉదయం రాజమండ్రిలో చర్చించాము.

ప్రాజెక్ట్ సైట్ లో పనుల పురోగతిని పరిశీలించాము.దెబ్బతిన్న గైడ్ బండను కూడా పరిశీలించాం.

స్పిల్ వేకి లెఫ్ట్ సైడ్ న ఉన్న గైడ్ బండ్ దెబ్బతింది.కొన్ని పత్రికలు, మీడియాలు గైడ్ బండ్ పై విష ప్రచారం చేస్తున్నాయి.

డిజైన్ తప్పిదామా లేక ఏజెన్సీ తప్పిదమా అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది.ఇది ప్రభుత్వం వైఫల్యం లాగా, పోలవరం నిర్మాణంలో పెద్ద తప్పిదం లాగ, జగన్మోహన్ రెడ్డి తప్పిదం లాగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు.

Advertisement

ఇది ప్రమాదకరమైంది కాదు.ఎందుకిలా జరిగిందనేది చర్చిస్తున్నారు.

స్పిల్ వే వద్ద సుడిగుండాలు ఏర్పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా గైడ్ బండ్ నిర్మాణం చేశారు.పోలవరం ప్రాజెక్టు చాలా వైవిధ్యంతో కూడుకున్న ప్రాజెక్ట్.

ప్రపంచంలోనే ఈ రకమైన ప్రాజెక్ట్ లేదు.నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేసి కట్టిన ప్రాజెక్ట్ ఇది.స్పిల్ ఛానల్ , అప్రోచ్ ఛానల్ నిర్మాణాలు పూర్తి చేశాం.ఇక్కడ జరుగుతున్న విషయాలు రహస్యంగా దాయల్సిన అవసరం మాకు లేదు.

ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి భజనలు చేపించాల్సిన అవసరం మాకు లేదు.మాజీ మంత్రి దేవినేని ఉమా అనుమతి లేకుండా చొరబడేందుకు చూసాడు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

బిజెపి నేతలు అనుమతితో వచ్చి పరిశీలించారు.పవన్ కళ్యాణ్ వస్తానంటాడు అనుమతులు తీసుకోడు అసలు రాడు.

Advertisement

చిత్తశుద్ధితో పోలవరం నిర్మాణం చేపడుతున్నాము.చైనాకు, భారత్ కు యుద్ధం జరిగినట్లుగా వార్తలు రాస్తున్నారు.

గతంలో కాపర్ డ్యాం పూర్తికాకుండా డయాఫ్రం వాల్ కట్టి వదిలి వెళ్ళిపోయారు.దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు 2,200 కోట్లు అవుతుందని.

చెబితే వారి తప్పు ఒక్క ముక్క రాయరు.ఈనాడు ఆంధ్రజ్యోతి పొలిటికల్ లబ్ధి కోసం రాస్తే ప్రజలు నమ్మరు.

రెండు కాపర్ డ్యాములు పూర్తయ్యాయి వచ్చే వరదలకు వాటి సామర్థ్యం బయటపడుతుంది.ఇవి తాత్కాలికమైనవి మాత్రమే.

ఎర్త్ కం రాక్ ఫీల్డ్ డ్యామ్ వద్ద 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకతో వైబ్రో కాంప్యాక్ట్ చేయాలి.ఇప్పటివరకు 40 లక్షలు మీటర్లు చేసాము మరో నాలుగు మీటర్లు చేయాల్సి ఉంది.అన్ని అనుకూలిస్తే ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పూర్తి చేస్తాము.41.15 వరకు వాటల్ లెవల్ వరకు 12,911 కోట్లు ఇచ్చారు.17 వేల కోట్లు ఇస్తే మొదటి దశ పనులు పూర్తి కావడం తో పాటు కాలవలకు నీరు విడుదల చేస్తాము.45.72 కు నీటిని రెండవ దశలో నింపుతాము.

తాజా వార్తలు