సినిమా చూసి లక్ష రూపాయలు గెలవండి... షరతులు వర్తిస్తాయి!

ఇండియాలో జనాలకి ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం సినిమా.అందుకే ఇక్కడ సినిమాలకి మంచి గిరాకీ.

ఇక్కడ వున్న ఫ్యాన్ బేస్ ఇంకే దేశాల్లోకూడా ఉండదంటే మీరు నమ్ముతారా? ఇక హీరోలు కూడా తమ ఫాన్స్ కోసమే సినిమాలు చేసిన పరిస్థితి ఉంటుంది.అందుకే ఎన్నో ప్రయోగాలు చేసిన సత్తా వున్న హీరోలు కూడా కేవలం మాస్ సినిమాలకే పరిమితం అవుతూ వుంటారు.

సినిమా ఓ కళ అయినప్పటికీ ఎక్కువగా మన నిర్మాతలు వ్యాపారంగానే చూస్తారు.అయితే సినిమాలపైనే ఎంతో పిచ్చి ఉంటే తప్ప అందరూ సినిమాలు చేయరు.ఎందుకంటే ఇక్కడ సినిమాలకి సక్సెస్ రేటు అనేది చాలా తక్కువ కాబట్టి.

అందుకే ఇప్పుడు సినిమాలను నిర్మించినవారు అవి విడుదలకు ముందే మార్కెటింగ్ కోసం అదనంగా ఖర్చు చేస్తూ వుంటారు.ఇలాంటి క్రమంలోనే ఇలాంటి ప్రైజ్ మనీ లాంటివి పెడుతూ వుంటారు.

Advertisement
Watch Movie And Win Rs.1 Lakh Conditions Apply Rajayogam Movie , Cinima, One Lak

అది కూడా మార్కెటింగ్ లో భాగమే.ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇలాంటి ట్రిక్స్ ప్రయోగిస్తూ వుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా టీం.ప్రేక్షకులకు బంపరాఫర్‌ ప్రకటించింది.తమ సినిమా చూసిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది.

Watch Movie And Win Rs.1 Lakh Conditions Apply Rajayogam Movie , Cinima, One Lak

దాంతో పాటు ఓ కండీషన్‌ కూడా పెట్టింది.వివరాల్లోకి వెళితే, సాయి రోనక్ హీరోగా అంకిత సాహా, బిస్మి నాస్ హీరోయిన్స్‌గా.కొత్త దర్శకుడు రామ్ గణపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాజయోగం.

2022, డిసెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ అయింది.కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుందని భోగట్టా.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?

ఈ నేపథ్యంలో. సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకేళ్లందుకు గాను ఈ ఆఫర్‌ ప్రకటించింది చిత్ర బృందం.

Advertisement

షరతు విషయానికొస్తే, సినిమా చూసి.నవ్వకుండా ఉండాలట.

అలా ఉంటేనే లక్ష రూపాయలు సొంతం అని అంటున్నారు.ఇంకెందుకాలోచిస్తునారు.

పదండి సినిమాకి వెళ్దాం.

తాజా వార్తలు