విండోస్‌ 11 వాడేవారికి హెచ్చరిక... స్నిప్పింగ్ టూల్‌ ఓపెన్ చేస్తే అంతే!

మైక్రోసాఫ్ట్‌( Microsoft ) విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడేవారికి స్నిప్పింగ్‌ టూల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ టూల్‌ని దాదాపుగా అందరూ వినియోగిస్తారు.

ఇక దీని వినియోగం గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు.దీనిని ఉపయోగించి మనకి నచ్చినట్టు స్క్రీన్‌షాట్‌ తీసుకోవచ్చు.

ఇమేజ్‌లలోని సెలక్టెడ్‌ పార్ట్స్‌ని క్యాప్చర్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఇది ఉపయోగపడుతుంది.ఇక లేటెస్ట్ విండోస్‌ 11 ( Windows 11 )ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో కూడా ఈ టూల్‌ ఉందనే విషయం విదితమే.

ఇక తాజాగా స్నిప్పింగ్‌ టూల్‌ ప్రైవసీకి సంబంధించి కొన్ని రకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

అవును, తాజాగా స్నిప్పింగ్‌ టూల్‌లో( snipping tool ) ఓ బగ్‌ను కనుగొన్నారు.వినియోగదారులకు తెలియకుండానే స్క్రీన్‌షాట్‌ల ద్వారా ఇన్ఫర్మేషన్‌ అనేది బహిర్గతం అవుతోంది.స్క్రీన్‌షాట్‌ ఇమేజ్‌లను ఎడిట్ చేసిన తర్వాత ఇతరులు అన్‌డూ చేయడం ద్వారా తిరిగి ఇన్‌ఫర్మేషన్‌ పొందే అవకాశం ఉండటాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేసినప్పుడు, దానిని ఓవర్‌రైట్ చేస్తూ ఒరిజినల్‌ ఫైల్‌తో అదే పేరుతో సేవ్ చేయవచ్చు.ఇలా చేసినప్పటికీ విండోస్‌ 11 స్నిప్పింగ్ టూల్‌ ఫైల్ నుంచి ఒరిజినల్‌ ఇన్‌ఫర్మేషన్‌ను డిలీట్‌ చేయడం లేదని గుర్తించారు.

తద్వారా బగ్ ఉందనే ఉందనే విషయాన్ని నిపుణులు కనిపెట్టారు.దీంతో యూజర్ల డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది.పిక్సెల్ ఫోన్లకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిన నేపథ్యంలో, విండోస్‌ 11లో కూడా అదే జరుగుతోందని ట్విట్టర్‌ యూజర్‌ క్రిస్ బ్లూమ్( Chris Bloom ) ట్వీట్‌ చేయడం జరిగింది.

అనంతరం డేవిడ్ బుకానన్ ( David Buchanan )విండోస్ 11 స్నిప్పింగ్ టూల్‌లోని ప్రాబ్లమ్స్‌ను నిర్ధారించారు.ఉదాహరణకు అమెజాన్‌లో ఆర్డర్ కన్‌ఫర్మేషన్‌ పేజీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తే, అందులో అడ్రస్‌ ఉండవచ్చు, దానిని ఎడిట్‌ చేసినప్పటికీ, ఇతరులు అడ్రస్‌ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఇతర సున్నితమైన డేటా వంటివి కూడా రిస్క్‌లో పడేస్తాయి.అయితే ఈ బగ్ హ్యాకర్‌ని పూర్తి ఇమేజ్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించదని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు