ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు గవర్నర్ ను కలవడంపై ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గవర్నర్ ను కలిస్తే ఉద్యోగుల సమస్యలను చెప్పాలన్న ఆయన ఇతర సంఘాల నేతలపై విమర్శలు చేయొద్దని విమర్శించారు.
గతంలో టీడీపీకి అనుకూలమన్నారన్న ఆయన ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలమంటూ చెబుతున్నారని మండిపడ్డారు.తాము సీఎంకు సమస్యలు చెప్తే ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.
అదేవిధంగా సూర్యనారాయణకు నిజంగా ఉద్యమ స్ఫూర్తి ఉంటే రేపటి నుంచి సమ్మెకు వెళ్లాలని సవాల్ చేశారు.మరోవైపు బండి వ్యాఖ్యలకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.
తమ సర్వీసులను నియంత్రించే అధికారం గవర్నర్ కు ఉంది కాబట్టే కలిశామని పేర్కొన్నారు.అదేవిధంగా తాము వేరే సంఘం పేరు ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
రేపటి నుంచి సమ్మెలకు వెళ్లే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు.







