మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.మెగా ఫ్యాన్స్ కు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి మంచి మాస్ ట్రీట్స్ అయితే ఇస్తున్నాడు.
ఇక ఈ సంక్రాంతికి కూడా మెగాస్టార్ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.
ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మెగాస్టార్ ను చాలా ఏళ్ల తర్వాత అలా చూసిన మెగా ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు.

మెగాస్టార్ మాస్ లుక్ ప్రేక్షకులను ఫిదా చేసింది.ఈయన యాటిట్యూడ్, మ్యానరిజం అంతా బాగా ఆకట్టు కోవడంతో మెగాస్టార్ ఈసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకు పోతుంది.
మరి ఈ సినిమా రెండు వారాల కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

రెండు వారాల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 124.27 కోట్ల నెట్ 212.40 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది.ఓవరాల్ గా ఈ సినిమా 88 కోట్ల బిజినెస్ జరుపుకోగా.89 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.మరి ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటికే నిర్మాతలకు 35.27 కోట్ల లాభం వచ్చినట్టు తెలుస్తుంది.అందుకే ఇంత భారీ విజయం సాధించిన సందర్భంగా హనుమకొండలో భారీ స్థాయిలో సక్సెస్ ఈవెంట్ జరపనున్నారు.మెగాస్టార్ కు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రేంజ్ హిట్ దక్కడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
