ఎంటేంటి బీజేపీకి ఫేస్ బుక్ భయపడుతోందా ? వాల్ స్ట్రీట్ సంచలన కథనం

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామిగా ఉన్న ఫేస్ బుక్ కు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది.

భారత్లో ఫేస్ బుక్ బీజేపీకి అనుకూలంగా పాణించేస్తోంది అంటూ అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.ఫేస్ బుక్ లో బిజెపి నాయకులు అత్యంత వివాదాస్పదమైన పోస్టింగ్స్ పెడుతున్నా, వారికి సంబంధించిన ఖాతాల పై  ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఫేస్ బుక్ ముందుకు రావడంలేదని, ముఖ్యంగా ఫేస్ బుక్ ఇండియా ఉన్నతాధికారిగా పని చేస్తున్న అంకిత్ దాస్ బిజెపి భావజాలంతో పని చేస్తున్నారంటూ వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ప్రచురించడం ఇప్పుడు కలకలం గా మారింది.

బిజెపి నాయకుల ఖాతాల పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, మౌనంగా ఉండడం వెనుక కారణం ఫేస్ బుక్ ఇండియా బిజెపికి అనుకూలంగా ఉండటమే అంటూ, వాల్ స్ట్రీట్ జనరల్ తన కథనంలో పేర్కొంది.బిజెపి నాయకులు అత్యంత వివాదాస్పదమైన పోస్టులు పెడుతున్నా, వాటిపై ఫిర్యాదులు వస్తున్నా, వాటిపై చర్యలు ఫేస్ బుక్ ఉద్యోగులు తీసుకోకుండా అంకిత్ దాస్ అడ్డుపడుతున్నారని, ఆ కథనంలో పేర్కొంది.

అయితే దీనంతటికీ కారణం బీజేపీ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకున్నా, భారత్ లో ఫేస్ బుక్ ప్రభుత్వం తో సంబంధాలు దెబ్బతింటాయని, దాని ప్రభావం ఫేస్ బుక్ వ్యాపారంపైన పడుతుంది అనే కారణాన్ని అంకిత దాస్ చెబుతున్నారు అంటూ వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది.

Advertisement

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం కూడా వాల్ స్ట్రీట్ జనరల్ ప్రస్తావించింది.రాజా సింగ్ కు సంబంధించిన ఫేస్ బుక్ పేజీలో అత్యంత వివాదాస్పదమైన, అభ్యంతరకరమైన పోస్టింగ్స్ వస్తున్నా, వారిపై ఎటువంటి చర్యలు తీసుకునేందుకు ఫేస్ బుక్ ముందుకు రావడం లేదని, దీనికి కారణం బీజేపీ అంటే భయమే కారణం అంటూ పేర్కొంది.సంఘ్ పరివార్ నాయకులు ఇతర మతాలను కించ పరిచే విధంగా పోస్టింగ్స్ పెడుతున్నా, హింసను ప్రేరేపించే విధంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నా, వాటిని తొలగించేందుకు ఫేస్ బుక్ సాహసించడం లేదని వివరించింది.

ఇండియాలో ఫేస్ బుక్ బిజెపికి, ప్రధాని మోదీ కి అనుకూలంగా ఉండడంతోనే ఇదంతా జరుగుతున్నట్లు ఫేస్ బుక్ మాజీ అధికారులు చెప్పినట్లుగా వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది.దీని కారణంగా సంస్థకు చెడ్డ పేరు వస్తుందనే ఆందోళన ఆ మాజీ ఉద్యోగులు వ్యక్తం చేసినట్లుగా పేర్కొంది.

ఇదంతా ఫేస్ బుక్ ఉన్నతాధికారి జోక్యం వల్లే ఉద్యోగులు సైతం మౌనంగా ఉంటున్నారంటూ, వాల్ స్ట్రీట్ జనరల్ బయటపెట్టడంతో, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.అయితే వాల్ స్ట్రీట్ కథనంపై ఫేస్ బుక్ ఏ విధంగా స్పందిస్తుందో.

రేవంత్ కు టార్గెట్ అయిపోయిన హరీష్ రావు
Advertisement

తాజా వార్తలు