రష్యాపై ( Russia ) తిరుగుబాటు ప్రయత్నం చేసిన తర్వాత వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్( Yevgeny Prigozhin ) బెలారస్‌కు వెళ్లిపోయారనే వార్తలు ఈమధ్య బాగా వినిపించిన సంగతి విదితమే.అయితే వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో( Alexander Lukashenko ) వెల్లడించడంతో ఈ న్యూస్ మీడియాలో ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది.
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆయన ఉన్నారని.వాగ్నర్ సేనలు( Wagner Group ) మాత్రం తిరుగుబాటుకు ముందున్న ప్రాంతంలోనే ఆయా క్యాంపుల్లో ఉన్నాయని ఆయన తాజాగా తెలిపారు.

వాగ్నర్ గ్రూపు అనేది పుతిన్( Putin ) ప్రైవేటు సైన్యం అనే సంగతి విదితమే.కాగా జూన్ 24న రష్యా అధినేతపైనే వారు తిరుగుబాటుకు యత్నించడంతో పుతిన్-ప్రిగోజిన్‌ల మధ్య బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించి తిరుగుబాటుకు అడ్డుకట్ట వేశారు.ఆ తరువాత ప్రిగోజిన్, ఆయన దళానికి భద్రతపరమైన హామీలు ఇవ్వడంతోపాటు వారిని బెలారస్‌కు వచ్చేందుకు లుకషెంకో అనుమతి కూడా లభించింది.ఈ క్రమంలోనే ప్రిగోజిన్ బెలారస్ చేరుకున్నారనే వార్తలు వచ్చాయి.
దీనిని ధ్రువీకరించిన లుకషెంకో.వాగ్నర్ చీఫ్ బెలారస్‌లోనే ఉన్నారని గతవారం పేర్కొన్నారు.

అయితే తాజాగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.ప్రిగోజిన్ బెలారస్‌లో( Belarus ) లేరని.ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్నారని చెప్పడం కొసమెరుపు.అయితే, వాగ్నర్ క్యాంపులు మాత్రం ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఆయన వేలలాడించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
సంధిలో చేసుకున్న పలు హామీలను ఖరారు చేసుకోవడానికే ప్రిగోజిన్ రష్యాకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న ‘వాగ్నర్ గ్రూపు’. తిరుగుబాటు ప్రయత్నంలో భాగంగా రొస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది.ఇక్కడే అసలు సమస్య మొదలైంది.