ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి 'వివో' అవుట్...!

ఈ సంవత్సరం మార్చి నెలలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే తాజాగా మార్చ్ నెలలో మొదలవ్వాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఆ సమయాన్ని ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది.

దీంతో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ సీజన్ ను యూఏఈ దేశంలో జరపాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు నిర్ణయించారు.అయితే గత నెలలో భారత్ - చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైనికులు 20 మంది చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్ చైనా కు సంబంధించిన 59 యాప్స్ భారత ప్రజల సమాచారానికి భంగం కలిగించేలా ఉన్నాయన్న నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.అయితే 2018 నుండి చైనా దేశానికి సంబంధించిన మొబైల్ రంగ సంస్థ వివో భారతదేశంలో జరిగే ఐపీఎల్ కు ఐదు సంవత్సరాలకు గాను ఏకంగా రూ.2199 కోట్లను కాంట్రాక్టుగా నియమించుకుంది.అయితే భారత సైన్యంతో జరిగిన గొడవల కారణంగా భారతదేశంలో బాయ్ కాట్ చైనా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కూడా రద్దు చేయాలని బిసిసిఐకి అనేకమంది అభిమానులు విజ్ఞప్తి చేశారు.

తాజాగా భారతదేశ క్రికెట్ కౌన్సిల్, ఐపీఎల్ నియామక మండలి నిర్వహించిన సమావేశంలో వివో ను స్పాన్సర్ షిప్ కొనసాగించే విధంగా ఆదేశాలు జారీ చేశారు.అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

Advertisement

ఈ పరిస్థితుల నేపథ్యంలో వివో కంపెనీ తనంతట తానే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది.దీంతో ఐపీఎల్ నుండి వివో నిష్క్రమించి నట్లయింది.

ఇక ఐపీఎల్ 2020 సీజన్ నడిపేందుకు మరో స్పాన్సర్ ను వెతికే క్రమంలో పడింది బీసీసీఐ.

Advertisement

తాజా వార్తలు