అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌- వివేక్ రామస్వామి కలిసి పోటీ చేస్తారా, మీడియాలో విస్తృతంగా కథనాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు .

రిపబ్లికన్ పార్టీ తొలి ప్రైమరీలో హేమాహేమీలను ఢీకొట్టి అమెరికన్ల మనసులను గెలుచుకున్నారు.

డిబేట్ తర్వాత జరిగిన పోల్‌లోనూ, విరాళాల సేకరణలోనూ వివేక్ రామస్వామి ముందంజలో నిలిచారు.తొలి ప్రైమరీ డిబేట్ ముగిసిన మరుసటి రోజే ఏకంగా 4,50,000 డాలర్లను వివేక్ సేకరించారు.ఈ నేపథ్యంలో ఒకవేళ రిపబ్లికన్ నామినేషన్‌ను గెలవని పక్షంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వివేక్ ఉమ్మడి టికెట్‌పై పోటీ చేయవచ్చంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.38 ఏళ్ల ఈ అమెరికన్ బిలియనీర్ కొద్దిరోజుల క్రితం మీడియాలో మాట్లాడుతూ.తనకు ప్రెసిడెంట్ పోస్ట్ తప్పించి మరే ఇతర పదవిపై ఆసక్తి లేదని తెలిపాడు.

అధ్యక్షుడిగా గెలిస్తే.దేశాన్ని తిరిగి కలుపుతానని రామస్వామి చెప్పాడు.

ఇదే సమయంలో తనకు ఒకవేళ ఉపాధ్యక్ష పదవి( Vice President ) ఆఫర్ చేస్తే తిరస్కరిస్తానని తెలిపాడు.జాతీయ గుర్తింపును పునరుద్ధరించడం, రాజకీయాల పట్ల తీవ్ర అసంతృప్తితో వున్న తదుపరి తరం అమెరికన్లను( Americans ) చేరుకోవడంపైనే తాను దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తనకు నవంబర్ 2024 అనేది గమ్యం కాదని.ఇది ప్రారంభం మాత్రమేనని, నిజమైన గమ్యం జనవరి 2033 అని వివేక్ చెప్పారు.తాను తదుపరి అధ్యక్షుడినైతేనే అమెరికా విప్లవం కలను సాకారం చేయగలనని పేర్కొన్నారు.1980లలో రోనాల్డ్ రీగన్( Ronald Reagan ) వలే తాను కూడా 2024లో దేశానికి నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వివేక్ చెప్పారు.బుధవారం జరిగిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్ తర్వాత రామస్వామిని ట్రంప్( Donald Trump ) ప్రచార బృందం ప్రశంసించింది.

దీంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఉమ్మడి టికెట్ గురించి అమెరికన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

కాగా.భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.

తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.

Advertisement

అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.

తాజా వార్తలు