తెలంగాణ సచివాలయంలో కోవిడ్ ఆంక్షలు..!!

తెలంగాణలో భారీగా కరోనా కేసులు బయట పడుతున్న సంగతి తెలిసిందే.

దీంతో గాంధీ హాస్పిటల్ అదేవిధంగా రాష్ట్రంలో మరికొన్ని హాస్పిటల్స్ లో రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.

దీంతో మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో విద్యాసంస్థలను క్లోజ్ చేసి రాత్రిపూట నైట్ కర్ఫ్యూ విధించటం మాత్రమేకాక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా కనిపిస్తే వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు.అయినా కానీ పరిస్థితి అదుపులోకి రాని క్రమంలో మరో పక్క ప్రభుత్వ అధికారులు కూడా కరోనా బారిన పడుతూ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో కోవిడ్ ఆంక్షలు విధించింది.

కేసులు పెరుగుతూ ఉండటంతో తాజాగా సర్క్యులర్ జారీ చేస్తూ విజిటర్స్ ఎవరు సచివాలయం లోకి రాకుండా ఆంక్షలు విధించింది.దీంతో తాత్కాలిక పాసులు నిలిపివేసింది.

 ఈ విధంగా దాదాపు 15 రోజుల పాటు తెలంగాణ సచివాలయంలో విజిటర్స్ ఎవరు రాకుండా భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల 70 వేలకు పైగానే కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

ఈ కేసులో చాలామంది రికవరీ అవగా ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేలకు పైగా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు