కోలీవుడ్ యాక్షన్ హీరోల్లో విశాల్ ఒకరు.ఈయనకు తెలుగులో కూడా బాగానే క్రేజ్ ఉంది.
ప్రెజెంట్ ఈయన నటించిన సినిమా లాఠీ.ఈ సినిమాను ఏ వినోద్ కుమార్ తెరకెక్కించారు.
హై యాక్టివ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్ పై నిర్మించారు.ఇందులో విశాల్ సరసన సునయన హీరోయిన్ గా నటించింది.
వచ్చే నెల డిసెంబర్ 22న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.పాన్ ఇండియా మూవీ అయిన ఈ సినిమా టీజర్, గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగిల్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసారు.
ఈ వేడుకకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో విశాల్ పోలీస్ డ్రెస్ లో వచ్చి అందరి అటెన్షన్ పొందారు.
అక్కడికి వచ్చిన ప్రేక్షకులను కూడా ఇది బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి.విశాల్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ గారిని కలవాలని ఎప్పటి నుండి నా కోరిక అని నా సినిమాకు ఆయన ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది అన్నారు.

ఇక ఈ వేడుకలో విజయేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడుతూ.విశాల్ గురించి చాలా మంది గొప్పగా చెప్పారు.కానీ నేను విశాల్ కు ఉన్న ఒక జబ్బు గురించి చెబుతున్న అని అన్నారు.మరి అది ఏంటంటే.సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా షూట్ చేయాలనే జబ్బు.ఇది మా అబ్బాయి రాజమౌళి నుండి నీకు అంటుకుంది అని.విశాల్ కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.సరదాగా చెప్పుకొచ్చారు.
మరి విశాల్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.







