కే‌సి‌ఆర్ vs జగన్.. ఇప్పుడేందుకిరచ్చ !

కే‌సి‌ఆర్( KCR ) వర్సస్ జగన్( Jagan ) ఇప్పుడిదే రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ మరియు ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి మద్య మొదటి నుంచి కూడా మంచి సానిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.

ఒకరిపై ఒకరు చాలా సందర్భాల్లో ప్రేమను కురిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా ఏపీలో గత ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ జగన్ కు గట్టిగా మద్దతు పలికారు.

జగన్ ప్రమాణ స్వీకరానికి కూడా కే‌సి‌ఆర్ హాజరైన సంగతి తెలిసిందే.అయితే ఇరు రాష్ట్రాల మద్య చిన్న చిన్న వివాదాలు తరచూ తెరపైకి వస్తున్నప్పటికి అవి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు.

కానీ ఈ మద్య కే‌సి‌ఆర్ మరియు జగన్ దూరం పెరుగుతోందా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Advertisement

ముఖ్యంగా కే‌సి‌ఆర్ బి‌ఆర్‌ఎస్ పార్టీని ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి వైసీపీ, బి‌ఆర్‌ఎస్( YCP, BRS ) పార్టీలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.కే‌సి‌ఆర్ మరియు జగన్ మద్య ఉన్న సక్యత కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి నడిచే అవకాశం ఉందనే వార్తాలు వచ్చాయి.ఏపీలోని ఇతర పార్టీలతో పొత్తులకు సిద్దమే అని ఒకానొక సమయంలో బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

కానీ ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో బి‌ఆర్‌ఎస్ తో పొత్తు ఉండదనే విషయం స్పష్టమైంది.ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా బి‌ఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు.

సందర్భాన్ని బట్టి పలు అంశాలపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇరు పార్టీల మద్య అగ్గి రాజుకుంది.విశాఖా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని బి‌ఆర్‌ఎస్ పార్టీ చెబుతోంది.విశాఖ ప్రైవేటీకరణ రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని బి‌ఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తుంటే.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఇప్పుడేందుకు కే‌సి‌ఆర్ ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు.దీంతో ఇరు పార్టీల మద్య ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

అయితే వైసీపీకి తాము దూరంగా ఉన్నామని చెప్పేందుకే బి‌ఆర్‌ఎస్ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.మొత్తానికి విశాఖా స్టీల్ ప్లాంట్ విషయంలో బి‌ఆర్‌ఎస్ వర్సస్ వైసీపీ మద్య జరుగుతున్నా రగడ రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త చర్చలకు తవిస్తున్నాయి.

తాజా వార్తలు