విరూపాక్ష (Virupaksha).ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు రిలీజ్ అయ్యింది.
ఈ రోజుకు వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.టైర్ 2 హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తో వచ్చి ఇన్నేళ్ల గ్యాప్ ను ఒక్క సినిమాతోనే ఫుల్ ఫిల్ అయ్యేలా చేసుకున్నాడు.
సాయి తేజ్ హీరోగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా విరూపాక్ష.
కార్తీక్ దండు (Karthik Varma Dandu) తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి షో లోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాతో సాయి తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు అనే చెప్పాలి.
మొదటి రోజు కంటే ఆ తర్వాత వీకెండ్ లో పుంజుకుని స్ట్రాంగ్ వసూళ్లను రాబట్టింది.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.ఎప్పుడో బ్రేక్ ఈవెన్ కూడా అయి లాభాల బాట పట్టింది.4 రోజుల్లోనే ఏకంగా 50 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది.స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా లాభాలను తెచ్చిపెట్టింది.మరి వారం రోజుల కలెక్షన్స్ గమనిస్తే.ఈ సినిమా ఏపీ తెలంగాణ కలిపి 25.11 కోట్ల షేర్, 43.40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఇక ఓవర్సీస్ లో 4.35 కోట్ల షేర్ రాగా.ప్రపంచ వ్యాప్తంగా 31.66 కోట్ల షేర్ వచ్చింది.మొత్తంగా ఈ సినిమా 57.20 కోట్ల గ్రాస్ రాబట్టి 8.66 కోట్ల లాభాలను దక్కించుకుంది.ఇప్పటికి దూసుకెళ్తున్న ఈ సినిమా మరింత లాభాలను అందించడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.







