అదేంటో గానీ ఈ మధ్య అమ్మాయిలు లేదంటే మహిళలు దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.తమకంటే చిన్న స్థాయి వారి మీద వీరి ప్రతాపం చూపించేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలాంటి ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి.కొన్ని రోజుల కిందట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఓ అమ్మాయి నడి రోడ్డు మీద క్యాబ్ డ్రైవర్ ను వీర బాదుడు బాదేసింది.ఆ ఘటన దేశ వ్యాపత్ంగా సంచలనం రేపింది.
ఆ ఘటనలో క్యాబ్ డ్రైవర్ తన ముందు కారును ఆపేయడంతో ఆ అమ్మాయి అలా ఆవేశానికి గురైంది.
అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఢిల్లీలో ఓ మహిళ ఇలాగే ఓ క్యాబ్ డ్రైవర్ మీద రెచ్చిపోయింది.సాధారణంగా ఢిల్లీ అంటేనే ఎంతో రద్దీ రోడ్లకు పెట్టింది పేరు.
ఇక కస్తూరి లాల్ ఆనంద్ రోడ్ అయితే ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా ఈ రోడ్ లోనే ఓ మహిళ మరో మహిళను తన స్కూటీమీద కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తోంది.
ఇక ఆ రోడ్డు మొత్తం బిజీగా ఉండటంతో ముందు వాహనాలను చూస్తూ హారన్ కొట్టింది.అయితే ఆమె ముందున్న క్యాబ్ మాత్రం కదలకపోవడంతో ఆమె కోపోద్రిక్తురాలు అయింది.
వెంటనే తన స్కూని నిలిపి ఆ డ్రైవర్ మీద దాడికి దిగిపోయింది.ఇష్టం వచ్చినట్టు తిడుతూనే కాలర్ పట్టుకొని చెడామడా వీర బాదుడు బాదేసింది.చుట్టూ ఉన్న వారు ఆపేందుకు ఎంతలా ప్రయత్నించినా ఆమె మాత్రం వినకుండా డ్రైవర్‌ను చితక్కొట్టింది.దీన్నంతా వీడియో తీసి నెట్టింట వదలగా ఆమె మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇక పోలీసుల వరకు ఈ వీడియో వెళ్లగా వారు ఆమె కోసం గాలిస్తున్నారు.క్యాబ్ డ్రైవర్ కంప్లయింట్ ఇవ్వాలని, తాము యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.