వైరల్ వీడియో: దారుణంగా నడిరోడ్డుపై వృద్ధురాలిని కింద పడేసి కొట్టిన దుర్మార్గుడు...!

రోజు రోజుకి మానవ జీవితంలో సామాజిక విలువలు తగ్గిపోతున్నాయి అనడానికి ఎన్నో సంఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటాం.

అలాంటి సంఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఓ 70 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేశాడు.

ఆమెను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చితకబాదాడు.కింద పడేసి మరి పక్కనే ఉన్న కుర్చీ తో ఆమెను చావబాదాడు.

అంతే కాదు అతని కోపం తీరకపోవడంతో ఆ వృద్ధురాలి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు.బలమైన దెబ్బలకు తట్టుకోలేక ఆ వృద్ధురాలు అక్కడే పడిపోయింది.

Advertisement

వ్యక్తి ఆ వృద్ధురాలిపై దాడి చేస్తున్న సమయంలో ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆవిడ వద్దు.కొట్టవద్దని బ్రతిమాలినా అతడు ఎటువంటి కనికరం చూపించకుండా ఆమెపై విరుచుకుపడ్డాడు.

ఈ దారుణ సంఘటన కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇకపోతే ఆ దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు.

అంత పెద్ద సంఘటన జరుగుతున్న అక్కడి ప్రజలు మాత్రం ఆ ముసలావిడ కాపాడడానికి ఎవరు సాహసించలేదు.ఇందుకు సంబంధించి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది కాస్తా పోలీసులకు చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు.

అయితే ఇది వరకే ఆ నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారని గజియాబాద్ పోలీసులు తెలియజేశారు.సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన నెటిజన్లు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అంతేకాదు ఆ వృద్ధురాలిపై దాడి చేసిన దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.దాడి జరుగుతున్న సమయంలో వృద్ధురాలిని కాపాడేందుకు ఏ ఒక్కరు సాహసించకపోవడం అనేది చాలామంది తప్పుబడుతున్నారు.

Advertisement

మరికొందరు ఇలాంటి ఘోరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం అంటూ విమర్శిస్తున్నారు.

తాజా వార్తలు