వైరల్ వీడియో: నాగిని డాన్స్ తో రెచ్చిపోయిన క్రికెటర్...!?

సాధారణంగా క్రికెటర్స్ క్రికెట్ ఆడేటప్పుడు కొన్ని సందర్భాలు, సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

క్రికెట్ ఆడే సమయంలో అవతలి జట్టు సభ్యులు ఎవరైనా అవుట్ అయినప్పుడు వారి ఆనందానికి హద్దులు ఉండవు.

అలా వారు ఆనందంలో గ్రౌండ్ లోనే ఒక్కోసారి డాన్సులతో చిందులు వేయడం, లేదా వారి ఎమోషన్స్ ను బయటపెడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.అలాంటి సంఘటన తాజాగా ఒకటి చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.షేక్‌ జాయేద్‌ స్టేడియం వేదికగా యూఏఈ - ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది.

వికెట్ తీసిన ఆనందంలో యూఏఈ క్రికెటర్ రోహన్‌ ముస్తఫా నాగిని డాన్స్ తో రెచ్చిపోయాడు.ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో 33వ ఓవర్ లో రోహన్‌ ముస్తఫా బౌలింగ్ వేసాడు.

Advertisement

అదే సమయంలో క్రిజ్ లో ఉన్న ఐర్లాండ్ బ్యాట్స్మెన్ లోక్రాన్‌ టక్కర్ బంతి అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ గా వెనక్కి అయ్యాడు.దీంతో ఆనందం పట్టలేని బౌలర్ రోహన్‌ ముస్తఫా కొన్ని సెకండ్లపాటు నాగిని స్టెప్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈ డాన్స్ చూసి తోటి క్రికెటర్లు " నీలో ఈ కల కూడా ఉందా." అంటూ రోహన్‌ ముస్తఫాని అభినందించడం మొదలుపెట్టారు.

తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను అబుదాబి క్రికెట్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.దీనితో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఈ మ్యాచ్ భాగంగా ముందుగా టాస్ గెలిచి ఐర్లాండ్ బ్యాటింగ్ చేయగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన యూఏఈ 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ కి అవసరమైన పరుగులు చేయగలిగింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రోహన్ నాగిని డాన్స్ వీడియో ను చూసేయండి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు